https://oktelugu.com/

Chanakya Niti: ఈ 5 సూత్రాల ద్వారా కష్టాల నుంచి బయటపడొచ్చు..

ప్రతి ఒక్కరికీ కష్టం వస్తుంది. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అయితే ముందుగానే కొన్ని రకాల వ్యూహాలు ఏర్పరుచుకోవడం వల్ల కష్టాల ఊబిలో పడకుండా ఉంటారు. అయినా కష్టం ఎదుర్కొన్నప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలి? అనే ప్రణాళిక వేసుకోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2024 5:21 pm
    Chanakya Niti

    Chanakya Niti

    Follow us on

    Chanakya Niti: జీవితం కష్ట, సుఖాల మయం. ఎప్పడూ సంతోషంగా ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. ఒక్కోసారి భరించలేని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ కష్టాల నుంచి బయటపడేవారు కొందరు మాత్రమే ఉంటారు. మిగతా వారు భయపడిపోయి ఏదేదో చేసుకుంటారు. కానీ చాణక్య నీతి సూత్రాలు తెలుసుకుంటే మాత్రం ఈ కష్టాలనుంచి బయడపడొచ్చు అని తెలుస్తోంది. అపర చాణక్యుడు మనుషుల జీవితాలకు సంబంధించి విలువైన సూత్రాలను అందించారు. ఇవి పాటించడం వల్ల తమ జీవితాలను సంతోషమయంగా మార్చుకోవచ్చు. అయితే చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలు కఠినంగా ఉన్నప్పటికీ వీటిని ఫాలో కావడం వల్ల ఫైనల్ గా విజయం సాధిస్తారు. అయితే తీవ్ర కష్టాల్లో కూరుకు పోయిన వ్యక్తి వీటి నుంచి బయటపడాలంటే కొన్ని సూత్రాలు ఫాలో కావాలి. అవేంటంటే?

    వ్యూహం:
    ప్రతి ఒక్కరికీ కష్టం వస్తుంది. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. అయితే ముందుగానే కొన్ని రకాల వ్యూహాలు ఏర్పరుచుకోవడం వల్ల కష్టాల ఊబిలో పడకుండా ఉంటారు. అయినా కష్టం ఎదుర్కొన్నప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలి? అనే ప్రణాళిక వేసుకోవాలి. కొన్ని ప్రణాళికల వల్ల ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోగలుగుతారు. ఉదాహరణకు అత్యవసర పనులు ముందుగా చేయాలి. అవసరం లేని పనలు వాయిదా వేసుకోవాలి. దీంతో బ్యాలెన్స్ అవుతుంది.

    సహనం:
    చాలామంది ఎలాంటి కష్టం ఎదుర్కొన్నా.. వెంటనే ఆందోళన పడిపోతూ ఉంటారు. దీంతో కొందరు ప్రాణాలు తీసుకోవడానికి కూడా రెడీ అవుతారు. కానీ ఒక్కోసారి జీవితం గురించి తెలియడానికి ఇలాంటి కష్టాలు వస్తాయని అంటున్నారు. అయితే ఇవి శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. కొన్నాళ్ల పాటు సహనంతో ఉండడం వల్ల కష్టాలు మాయమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా కష్టం ఏర్పడినప్పుడు వెంటనే ఆందోళన చెందకుండా సహనం పాటించాలి.

    డబ్బు ఆదా:
    ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బుతోనే పని. అందువల్ల డబ్బును ఆదా చేసుకోవడం నేర్చుకోవాలి. ఇలా ఆదా చేసిన డబ్బు కష్ట సమయంలో ఉపయోగపడుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఒక్కోసారి ఆదాయం పెరిగినప్పడు వీటిని దుబారా చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి. అయితే ఈ డబ్బును ఇంట్లోనే ఉంచుకోకుండా వివిధ మార్గాల ద్వారా డిపాజిట్లు చేయడంతో వాటిపై అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

    అదనపు ఖర్చులు:
    చాలా మంది ఎంత జీతం పెరిగినా.. ఎంత ఆదాయం వచ్చినా సరిపోదు అని అంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆదాయం మిగులుతుంది. అంతేకాకుండా అనవసర వస్తువులు కొనుగోలు చేయడం మానుకోవాలి. కొందరు తమ హోదా కోసం దుబారా ఖర్చులు అధికంగా చేస్తారు. దీంతో ఆదాయం మిగలకుండా ఉంటుంది. దీంతో భవిష్యత్ అవసరాల కోసం ఇతరుల వద్ద డబ్బు కోసం చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుంది.

    రిలేషన్ షిప్:
    డబ్బు ఎన్ని పనులు చేస్తున్నా.. మనుషుల మధ్య సంబంధాలను నెలకొల్పదు. అందువల్ల డబ్బు సంపాదించడంతో పాటు సంబంధాలు మెరుగుపరిచే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే కష్ట సమయాల్లో కొందరు ఆదుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంధువులను ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండడం వల్ల వారు ఇటువంటి సమయంలో ఉపయోగపడవచ్చు.