https://oktelugu.com/

Ka Collection: మొదటి సోమవారం కూడా హౌస్ ఫుల్స్..’క’ చిత్రానికి బ్రేకులే లేవా..? 5 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!

నైజాం ప్రాంతంలో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 3 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి ఈ ప్రాంతంలో అప్పుడే 15 లక్షల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో మూడు కోట్ల రూపాయిలు వచ్చే అవకాశం ఉందట.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 06:12 PM IST

    Ka Collection(2)

    Follow us on

    Ka Collection: ‘దీపావళి’ కానుకగా విడుదలైన కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాలలో వారం రోజులు కూడా గడవకముందే పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సంచలనం సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో ఫాస్టెస్ట్ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న సినిమాలలో ‘క’ కూడా నిల్చింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించినప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదు. కానీ 5 వ రోజు మాత్రం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది. నేడు నాగుల చవితి కావడంతో ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలలో రికార్డు స్థాయి హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. కాబట్టి నేడు ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా 5 రోజులకు ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

    నైజాం ప్రాంతంలో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 3 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి ఈ ప్రాంతంలో అప్పుడే 15 లక్షల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో మూడు కోట్ల రూపాయిలు వచ్చే అవకాశం ఉందట. అదే విధంగా సీడెడ్ లో కూడా ఈ చిత్రానికి ప్రతీ సెంటర్ లో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కోటి 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కోటి 40 లక్షల రూపాయలకు జరగగా, 30 లక్షలకు పైగా లాభాలు వచ్చాయి. ఇక కోస్తాంధ్ర లో అయితే కళ్ళు చెదిరే లాభాలు వచ్చాయి. ఈ ప్రాంతంలో 3 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి, 5 రోజుల్లో 4 కోట్ల 68 లక్షా రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే కోటి 68 లక్షలు ఈ ప్రాంతం నుండి లాభాలు వచ్చాయన్నమాట.

    అయితే ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 4 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి 5 రోజుల్లో మూడు కోట్ల రూపాయిల లోపే వసూళ్లు వచ్చాయట. ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ చిత్రానికి టాక్ కి తగ్గ వసూళ్లు రావడం లేదు. ఓవరాల్ గా 5వ రోజు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 5 రోజులకు కలిపి 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కు అందుకోవాలంటే మరో రెండు కోట్ల రూపాయిల షేర్ రావాల్సి ఉంది. మొదటి వారం ముగిసేలోపు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందట. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అన్ని ప్రాంతాలలో అయిపోయింది.