https://oktelugu.com/

Adilabad: రెండున్నర కిలోల నువ్వెల తాగిన మహిళ.. ఈ జాతరలో ఇదే స్పెషల్‌

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. మన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటారు. బాహ్య ప్రపంచంతో అంత ఈజీగా కలిసిపోరు. కలిసినా.. వారి సంప్రదాయాలను మాత్రం వీడరు. పండుగలు, జాతరలకు తప్పకుండా హాజరవుతారు. ఆచారాలను పాటిస్తారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 16, 2025 / 02:43 PM IST

    Adilabad

    Follow us on

    Adilabad: మన దేశంలో అన్నిరకాల జనాభా ఉంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులుతోపాటు గిరిజన తెగులు కూన్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అటవీ జీవితాన్ని గిరిజనులు ఇష్టపడతారు. అందరితో కలిసిపోరు, టెన్నాలజీకి దూరంగా ఉంటారు. వారి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కచ్చితంగా పాటిస్తారు. ఆధునికత ఎంత పెరిగినా సంప్రదాయాలను మాత్రం తప్పరు. ఉత్సవాలు, వేడుకల్లో అందరూ పాల్గొంటారు. ఎక్కడ ఉన్నా స్వగ్రామాలకు చేరుకుంటారు. ప్రస్తుతం తెలంగాణలో నాగోబా జాతరతోపాటు ఖందేవుని జాతర జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌లో తొడసం వంశస్థుల ఆరాధ్య దైవం ఖాందేవుడు. మెస్రం వంశస్తుల ఆరాధ్య దైవం నాగోబా. ఖాందేవుని జాతర ఏటా సంక్రాంతి రోజున మొదలువుతుంది.

    నూనె తాగడమే స్పెషల్‌..
    ఈ జాతరలో తొడసం వంశానికి చెందిన ఆడబిడ్డ నాగుబాయి చందు రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగుతుంది. ఇదే ఈ జాతర స్పెషల్‌. మంగళవారం చందు నూనె తాగి మొక్కు తీర్చుకుంది. తొడసం వంశస్థుల ఇళ్ల నుంచి పూజకు నూనెను సేకరిస్తారు. ఈ నూనె ఆ వంశానికి చెందిన ఆడపడచు తాగి మొక్కు తీర్చుకోవడం అనాదిగా వస్తోంది.

    వివిధ రాష్ట్రాల నుంచి జాతరకు..
    ఇదిలా ఉంటే ఖాం దేవుని జాతరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతోపాటు మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఖాందేవుడిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు.