ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. జవని 12 లోపు టీంలను ప్రకటించాలని ఐసీసీ సూచించింది. కానీ, బీసీసీఐ మరికొంత సమయం కోరింది. ఈ వారంలో తుది జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారు. ఎవరికి హ్యాండిస్తారు అన్న చర్చ జరుగుతోంది. జనవరి 19న తుది జట్టును ప్రకటించే అవకాశం ఉంది. బీసీసీఐ సెలక్టర్లందరూ స్క్వాడ్‌ను వెల్లడిస్తారే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఇద్దరు కీలక ఆటగాళ్లపై పడింది. వారే సంజూ శాంసన్, కేఎల్ రాహుల్.
పంత్‌కు బ్యాకప్‌గా..
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో రిషభ్ పంత్‌ను కీపర్‌గా తీసుకోవడం ఖాయం. అయితే పంత్‌కు బ్యాకప్‌గా కేఎల్.రాహుల్, సంజూశాంసన్‌ను తీసుకునే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. సంజూ శాంసన్ చివరి వన్డేలో సౌత్ ఆఫ్రికాపై సెంచరీ చేశాడు. దీంతో అతడిని తీసుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక కేఎల్.రాహుల్ కూడా నిలకడైన ఆటతీరు కనబరుస్తున్నాడు. దీంతో అతనికీ ఛాన్స్ దక్కవచ్చన్న చర్చ జరుగుతోంది. గత వన్డే వర్డ్ కప్‌లో కేఎల్.రాహు కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించడు. కానీ, ఈసారి మా6తం స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకునే అవకాశం ఉంది. పంత్‌కు బ్యాకప్ కోసం ముగ్గురి పేర్లను బీసీసీఐ పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. సంజు శాంసన్‌తోపాటు ధ్రువ్ జురెల్, ఇషాన్‌కిషన్ ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ అదరగొడుతున్నాడు. దీంతో సంజూకు కూడా ఛాన్స్ దక్కకపోవచ్చని తెలుస్తోంది. సంజూను బీసీసీఐ కేవలం టీ20 ప్లేయర్‌గానే చూస్తోంది. ఇక ధ్రువ్ జురెల్ వన్డే అరంగేట్రం చేయలేదు. దీంతో ఐసీసీ టోర్నీకి అతడిని ఎంపిక చేసే అవకాశం లేదు. దీంతో పంత్‌కు బ్యాప్‌గా ఇషాన్‌ను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కోహ్లీ, రోహిత్ కు లాస్ట్ ఛాన్స్
ఇదిలా ఉంటే.. సీనియర్ ఆటగాళ్లు అయిన కోహ్లీ, రోహిత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ చివరి ఛాన్స్ అన్న చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియాలో వీరి ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. రిటైర్మెంట్ ప్రకటించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. అయితే బీసీసీఐ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇదే ఇద్దరికీ లాస్ట్ ఛాన్స్ అని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు స్థానం దక్కకపోవచ్చని సమాచాం.