https://oktelugu.com/

Politics Lookback 2024 : తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన.. మోదం.. ఖేదం!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. ప్రజల మన్ననలు పొందింది. అయితే మూసీ శుద్ధీకరణ, హైడ్రా విషయంలో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఏడాది కాంగ్రెస్‌ పాలనపై రివ్యూ..

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 15, 2024 / 04:05 PM IST

    Politics Lookback 2024

    Follow us on

    Politics Lookback 2024 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. తొలి ఏడాదిలో మిశ్రమ ప్రగతిని చూపుతోంది. ఎన్నికల హామీలపై పార్టీ పనితీరు అసమానంగా ఉంది. బీఆర్‌ఎస్‌ పదేళ్లలో చేసిన అప్పులను చూపుతూ చాలా హామీలను ఇంకా పెండింగ్‌లో పెట్టింది. కొన్నింటిని సమయానుకూలంగా అమలు చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. డిసెంబర్‌ 1న ప్రారంభమైన ప్రజాపాలన విజయోత్సవాలు పేరుతో 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వ విజయాలను ఎత్తిచూపారు, కానీ అమలు చేయని హామీలపై విమర్శలను కొట్టివేశారు.

    పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు చెక్‌..
    2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నిల్లో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు చెక్‌ పెట్టింది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో సంక్షేమం, సంస్కరణ చర్యలు, పారదర్శకతోపాటు అనే హామీలు ఇచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల నెరవేరని ఆకాంక్షలతో పాటు, బీఆర్‌ఎస్‌ అనేక పెండింగ్‌ వాగ్దానాలు, నాటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కెసిఆర్‌) ఏకపక్ష పాలనా శైలికి వ్యతిరేకంగా ప్రజల అసంతృప్తి కాంగ్రెస్‌ విజయం ఖాయమైంది.

    నెరవేర్చినవి కొన్నే..
    అధికారం చేపట్టిన రెండు రోజులకే మహాలక్షిమ పథకంలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్‌ సదుపాయం కల్పించారు. ఇప్పటికీ అమలవుతోంది. అయితే దీనిపై విమర్శలు కూడా ఉన్నాయి. తర్వాత ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఏయే పథకాలు ఎవరికి కావాలి.. ఎవరు అర్హులు అనే వివరాలు తెలుసుకుని కంప్యూటరీకరణ చేసింది. తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేసింది. అయితే రేషన్‌ కార్డు నిబంధన విధించింది. దీంతో అర్హత ఉన్న చాలా మంది లబ్ధి పొందలేకపోతున్నారు. తర్వాత రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారంభించింది. ఇది కూడా కొందరికే అందుతోంది.

    రేషన్‌ కార్డుల హామీ..
    తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్‌ కార్డు ఇవ్వలేదని విమర్శించిన కాంగ్రెస్‌ పార్టీ.. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కొత్త కార్డుల జారీపై నిర్ణయం తీసుకోలేదు. పథకాలకు రేషన్‌ కార్డు అర్హతగా పెట్టడంతో చాలా మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.

    రుణమాఫీ..
    రైతు రుణమాఫీ చేసినప్పటికీ చాలా మందికి అందలేదన్న అభిప్రాయం ఉంది. 80 శాతం మందికి రుణమాఫీ జరిగింది. అయినా ప్రతిపక్షాలు రుణమాఫీ చాలా మందికి కాలేదన్న ప్రచారం చేస్తున్నాయి. రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్నవారికి మాత్రమే మాఫీ కాలేదని తెలుస్తోంది. ఇక రైతు భరోసా ఇవ్వలేదు. ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది.

    పింఛన్ల పెంపు లేదు..
    ఇక తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ రుణమాఫీ మినహా ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కాలేదు. రూ.7 లక్షల కోట్ల అప్పుల కారణంగానే హామీలు అమలు చేయడం లేదని చెబుతోంది. పింఛన్లు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ అమలు కాలేదు. విద్యార్థులకు రూ.5 లక్షల రుణ కార్డులు, విద్యార్థినులకు స్కూటీలు అందలేదు.

    హైడ్రాతో విమర్శలు..
    హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన హైడ్రా మొదట రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కానీ, తర్వాత హైడ్రా తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పేదల ఇళ్లను కూల్చడంతో చాలా మంది వ్యతిరేకించారు. ఇక మూసీ ప్రక్షాళనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    ఇందిరమ్మ ఇళ్లు..
    ఇక పేదలకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మిస్తామని, సొంత జాగా ఉన్నవారికి రూ.5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీలు చ్చింది. కానీ ఏడాది గడిచినా ఒక్కరికి కూఏడా ఇళ్లు ఇవ్వలేదు. ఇటీవలే ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా సర్వే చేస్తోంది.

    మొత్తంగా కాంగ్రెస్‌పాలనపై పూర్తిగా వ్యతిరేకత రాలేదు. దీంతో ప్రతిపక్ష బీఈఆర్‌ఎస్‌ అధినేత కూడా మౌనంగా ఉంటున్నారు. విమర్శించేందుకు పెద్దగా అంశాలు దొరకడం లేదు. దీంతో కేటీఆర్, హరీశ్‌రావుతోనే ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారు.