Kooli movie : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోవడమే కాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే విక్రమ్ సినిమాతో ఆయన సాధించిన ఘనత మరొక ఎత్తనే చెప్పాలి. ఇక అప్పటివరకు ఏ దర్శకుడు కూడా కమల్ హాసన్ ఆ రేంజ్ లో చూపించలేదు. అలాంటి ఒక కొత్త కమల్ హాసన్ ను చూపించి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసిన దర్శకుడు లోకేష్ కనకరాజు… ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజుకి చాలా మంచి కెరీర్ ఉందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు రజనీకాంత్ ను హీరోగా పెట్టి కూలీ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ ను ఒక అండర్ వరల్డ్ డాన్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగబోతున్న ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో లోకేష్ కనకరాజు మరొకసారి భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రజినీకాంత్ కొంచెం హెల్త్ పరంగా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కూడా తను ఎక్కడ ఆగకుండా రజనీకాంత్ లేకుండానే అతని డూప్ ను పెట్టి సినిమా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక కొన్ని సీన్స్ చేయాలని కూడా తన భావిస్తున్నారట. మరి మొత్తానికైతే రజనీకాంత్ లేకుండానే ఆయన సినిమాని ఆల్మోస్ట్ తీసేస్తున్న లోకేష్ కనకరాజు గురించి రజనీకాంత్ అభిమానులు కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికి తమ హీరోకి హెల్త్ పరంగా కొంత ఇబ్బంది ఉండటం వల్లే రిస్కీ సీన్స్ మొత్తాన్ని ఆయన అలా టెక్నాలజీ ద్వారా రీ క్రియేట్ చేసుకుంటున్నాడట.
ఇక ఇది తెలిసిన రజనీకాంత్ అభిమానులు కూడా కొంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజు ఈసారి భారీ ప్రణాళికతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…చూడాలి మరి ఇకమీదట ఆయన ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది…