Digital Card Telangana: తెలంగాణలో కుటుంబాల సమాచారం మొత్తం ఒక డిజిటల్ కార్డులు నిక్షిప్తం చేసి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయింఇ. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 117 నియోజకవర్గాల్లో మూడు గ్రామాలు, రెండు మున్సిపల్ వార్డుల్లో సర్వే చేపట్టారు. ఈమేరకు ఇంటింటికీ వెళ్లిన బృందాలు ఫ్యామిలీ వివరాలు, ఆదాయం, ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యం వివరాలు, ఇలా అనేక అంశాలు సేకరిస్తున్నాయి. వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. తర్వాత ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ చేసాతరు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రమంతా అమలు చేసుందుకు కసరత్తు చేస్తోంది. కాగా, డిజిటల్ కార్డుల జారీకి తెలంగాణ అధికారులు ¯రాజస్థాన్, కర్ణాటక, హరియాణా, మహారాష్ట్రల్లో అధ్యయనం చేశారు. మెరుగైన అంశాలను పరిగణనలోకి తీసుని డిజిటల్ కార్డుల జారీకి చెందిన ప్రణాళిక సిద్ధం చేసింది. కార్డులో ఏయే అంశాలు ఉండాలి, తొలుత ఏ పథకాలు చేర్చాలనే అంశంపైనా ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చిటన్లు తెలుస్తోంది.
ప్రత్యేకంగా క్యూర్ కోడ్..
ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు ప్రత్యేకంగా ఓ క్యూఆర్‌కోడ్ ఉంటుందని అధికారులు తెలిపారు. కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య కేటాయిస్తారు. ఆ కుటుంబంలో ఒక్కో సభ్యుడికి విడి విడిగా ప్రత్యేక నంబర్ ఇస్తారు. కార్డుపై కుటుంబ యజమాని ఫొటో ఉంటుంది. కుటుంబ యజమానిగా ఉన మహిళనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అన్ని సేవలకు ఇదే కార్డు..
ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కోసం ఒక కార్డు, ఆరోగ్యం కోసం ఒక కార్డు, పథకాల కోసం ఇంకో కార్డు వేర్వేరుగా ఉన్నాయి. ఇకపై అన్ని సేవలను ఒకే కార్డు కిందకు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కార్డు ద్వారా తొలుత రేషన్, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకుపైగా రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డు వివరాలను కొత్తగా జారీ చేసే ఫ్యామిలి కార్డులో చేర్చనున్నారు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ వివరాలు కూడా కార్డులో చేర్చే అవకాశం ఉంది.
తర్వాత అన్ని పథకాలు..
తర్వాత క్రమంగా అన్ని పథకాల లబ్ధిరుల వివరాలు డిజిటల్ కార్డులో చేర్చే అవకాశం ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛన్ల పథకాలు, లబ్ధిదారులను డిజిటల్ కార్డులో చేర్చే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ఏదైనా పథకం తీసుకు వస్తే దానికి ఆధార్ సమర్పించడం వంటి ప్రయాసలు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుడు, సభ్యురాలి యూనిక్ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది.