HomeతెలంగాణPakistani Family Illegal Stay in Hyderabad: పాకిస్తాన్ నుంచి వచ్చాడు.. వీసా గడువు ముగిసినా...

Pakistani Family Illegal Stay in Hyderabad: పాకిస్తాన్ నుంచి వచ్చాడు.. వీసా గడువు ముగిసినా ఇక్కడే.. ఓ అమ్మాయి జీవితాన్ని ఏం చేశాడంటే?

Pakistani Family Illegal Stay in Hyderabad: దొంగ ఓట్లు.. రోహింగ్యాలు.. ఇతర ప్రాంతాల నుంచి మనదేశంలోకి వచ్చిన వ్యక్తుల గురించి మన రాజకీయ పార్టీలు గొంతు చించుకుంటాయి. పార్లమెంట్లో రచ్చ రచ్చ చేస్తుంటాయి. కానీ అసలు విషయం మాత్రం పట్టించుకోవు. ఇవాల్టికి సరిహద్దుల వద్ద గట్టిగా బందోబస్తు నిర్వహిస్తున్నాం. చొరబాట్లను అడ్డుకుంటున్నాం.. అని రకరకాలుగా రాజ్యాన్ని ఏలుతున్న పెద్దలు చెబుతుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధమైన ఘటనలు జరుగుతుంటాయి. అటువంటి దారుణమే హైదరాబాదులో ఒకటి చోటుచేసుకుంది. ప్రధాన మీడియా దీనిని పట్టించుకోలేదు కానీ.. సోషల్ మీడియా ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాదు నగరంలోకి 2010లో పాకిస్తానీ కుటుంబం వచ్చింది. అప్పట్లో ఈ స్థాయిలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు లేదు. విజిటింగ్ వీసా మీద వచ్చిన వారు ఇక్కడే ఉండిపోయారు. వీసా గడుగు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు. పైగా మన దేశం నుంచి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు కూడా పొందాడు. ఆ తర్వాత ఓ కంపెనీలో ఆ వ్యక్తి ఉద్యోగిగా చేరాడు. ఆ కంపెనీలో పని చేస్తున్న ఓ యువతితో మాట కలిపాడు. ఆ తర్వాత స్నేహంగా ఉండడం మొదలుపెట్టాడు. అతడి తో మొదట్లో అమ్మాయి అంతగా మాట్లాడేది కాదు. ఆ తర్వాత అతడు మాట్లాడే మాటలకు కరిగిపోయింది. అవన్నీ నిజమని నమ్మింది. దీంతో అతడి ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత అతడు క్రమంగా తన వైపుకు తిప్పుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు.

హైదరాబాదులో వారిద్దరు ఓ ప్రాంతంలో సంసారాన్ని మొదలుపెట్టారు. మొదట్లో ఆమెతో బాగానే ఉండే అతడు.. ఆ తర్వాత తను అసలు రూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఇటీవల కాలంలో ఆ అమ్మాయిని దూరం పెట్టడం ప్రారంభించాడు. కొద్ది రోజులుగా ఇంటికి రావడం కూడా మానేశాడు. అతడి వ్యవహార శైలి పై ఆమెకు అనుమానం వచ్చింది..దీంతో అతడిని ఫాలో అయింది. అయితే అతడు మరో అమ్మాయి తో ఉంటున్నట్టు తేలింది. దీంతో వారిద్దరిని ఆ మహిళ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పింది. అయితే ఈ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆ వ్యక్తి పాకిస్తాన్ దేశానికి చెందినవాడు. మనదేశంలోకి విజిటింగ్ వీసా మీద వచ్చాడు.. ఆ తర్వాత ఇక్కడే ఓ కంపెనీలో పని చేశాడు. అక్కడ పనిచేస్తున్న అమ్మాయిని ట్రాప్ చేశాడు. చివరికి పెళ్లి చేసుకొని ఇలా మోసం చేశాడు.. అయితే దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేవలం ఇతడు మాత్రమే కాకుండా.. చాలామంది పాకిస్తాన్ దేశస్తులు మన దేశంలో ఇలానే ఉన్నారని తెలుస్తోంది. వారంతా కూడా మన దేశపు గుర్తింపు కార్డులను పొందారని తెలుస్తోంది. వీరిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular