Viral Video : బీరు లో బెక బెక.. మందు బాబుకు వాంతులవ్వడం ఒకటే తక్కువ.. వీడియో వైరల్

చల్లని బీరు తాగి..చిల్ అవుదామని అనుకున్న వ్యక్తికి ఒకసారిగా షాకింగ్ పరిణామం ఎదురైంది. తాగే బీరులో.. కప్ప అవశేషం కనబడడంతో దిమ్మ తిరిగింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 7, 2024 8:44 pm

In the beer Found a Frog

Follow us on

Viral Video :  ఇటీవల కాలంలో బీర్లలో జంతువుల అవశేషాలు కనిపించడం సర్వసాధారణంగా మారింది. గతంలో కరీంనగర్ జిల్లాలో బీర్ సీసాలో బల్లి కనిపించింది. దానిపై మందుబాబులు తాము బీర్ కొనుగోలు చేసిన వైన్ షాప్ నిర్వాహకుడిని నిలదీశారు. అయితే అది తన తప్పు కాదని.. డిస్టిల్లరి నుంచి వచ్చిన బీర్లను మాత్రమే తమ విక్రయిస్తున్నామని.. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఆ బీరు సీసా మీద ఉన్న కస్టమర్ కేర్ నెంబర్ కి ఫోన్ చేసి అడగవచ్చని సూచించారు. ఆ సమాధానంతో సంతృప్తి చెందని మందుబాబులు ఆ వైన్ షాప్ ఎదుట గొడవకి దిగారు. దీంతో ఎక్సైజ్ అధికారులు కల్పించుకొని గొడవను సద్దుమణిగించారు. చివరికి ఆ వైన్ షాప్ నిర్వాహకుడుతో ఆ మందు బాబులకు కొన్ని బీర్లు ఇప్పించారు. ఆ సంఘటన మర్చిపోకముందే నిజామాబాద్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మందు బాబు కొనుగోలు చేసిన బీర్లు చనిపోయిన కప్ప ప్రత్యక్షమైంది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వైన్ షాప్ నిర్వాహకులను నిలదీశాడు. అయితే వారి దగ్గర నుంచి సంతృప్తికరమైన సమాధానం లభించకపోవడంతో ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది.

అధికారులు పట్టించుకోవడం లేదా..

బీర్ లలో చనిపోయిన జంతువుల అవశేషాలు కనిపించడం ఇటీవల పెరిగిపోయింది.. బీర్లలో బొద్దింకలు, బల్లులు, కప్పలు కనిపించడం సర్వసాధారణంగా మారిపోయింది.. ఎంతో ఉత్సాహంతో బీర్లు కొనుగోలు చేసి.. తాగుదామని భావించిన మందు బాబులకు.. ఆ జంతువుల అవశేషాలు కనిపించడం మింగుడు పడటం లేదు.” ఎప్పటినుంచో మద్యం తాగి అలవాటు ఉంది. దానిని ఇప్పుడు మానుకోలేకపోతున్నాం. పొద్దంతా కాయాకష్టం చేసి.. ఆ నొప్పులను మర్చిపోవడానికి మద్యం తాగుతున్నాం. మా సంపాదన మొత్తంలో సింహభాగం తాగుడికే ఖర్చు చేస్తున్నాం. మా ఇంటిని గుల్ల చేసుకుంటున్నాం. ఒంటికి నష్టం చేకూర్చుకుంటున్నాం. ప్రభుత్వానికి దండిగా ఆదాయం ఇస్తున్నాం. అయినప్పటికీ మా మీద కనికరం లేదు. పైగా మాపై ఈ సమాజం తాగుబోతులు అని ముద్ర వేసింది. చివరికి మా రక్త మాంసాల మీద వ్యాపారం చేసే మద్యం కంపెనీలు కూడా మమ్మల్ని చులకనగా చూస్తున్నాయి. మాకు అందించే మద్యాన్ని కూడా ఇలా తయారు చేస్తున్నాయని” మందుబాబులు వాపోతున్నారు.. అయితే దీనిపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు చెప్పడంతో..ఆ బీర్ కొనుగోలు చేసిన వ్యక్తి శాంతించాడు. మొత్తానికైతే ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది. కాగా, ఈ విషయంపై మందుబాబులు సామాజిక మాధ్యమాలలో స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.