Telangana politics: తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న డిఫెక్షన్ కేసులు రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతను పెంచుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమిథి) టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులు యాంటీ–డిఫెక్షన్ చట్టాన్ని, రాజ్యాంగ స్థానాన్ని ప్రశ్నించేలా మలుపు తిప్పుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలు, స్పీకర్ నోటీసులు, పార్టీల వాదనలు – ఈ ఘటనలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని రాస్తున్నాయి.
2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్‌ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు దాదంబోయినా నాగేందర్, కడియం శ్రీహరి, తెళ్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలె యాదయ్య, ఎం. సంజయ్ కుమార్, కృష్ణమోహన్‌రెడ్డి, మహీపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికేపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరినట్టు బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించి, ట్రెజరీ బెంచీల్లో కూర్చున్నారని బీఆర్‌ఎస్ వాదన. ఇది యాంటీ–డిఫెక్షన్ చట్టానికి (10వ షెడ్యూల్) విరుద్ధమని, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు 2024 మార్చి–ఏప్రిల్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సమర్పించారు. సుప్రీం కోర్టు 2025 జూలై 31న జారీ చేసిన ఆదేశాల్లో, స్పీకర్‌కు మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని డైరెక్ట్ చేసింది. దీంతో 2025, ఆగస్టు 23న స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారా లేదా అనే వివరణ కోరారు. ఇది డిఫెక్షన్ కేసుల్లో స్పీకర్ నిర్ణయాలపై రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. కోర్టు, స్పీకర్/ఛైర్మన్‌లకు డిఫెక్షన్ నిర్ణయాల బాధ్యతను అప్పగించడం సమర్థవంతమా అని పార్లమెంట్‌ను పరిశీలించమని సూచించింది.
బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని ఎమ్మెల్యేల వివరణ..
స్పీకర్ నోటీసులకు స్పందిస్తూ, 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది 2025 సెప్టెంబర్ 11 నాటికి వివరణలు సమర్పించారు. వారంతా ఐక్యంగా, ‘మేము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాం, కాంగ్రెస్‌లో చేరలేదు‘ అని పేర్కొన్నారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశాలు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సేవల కోసమే అని వాదించారు. కొందరు ‘టెక్నికల్‌గా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాం‘ అని, సోషల్ మీడియా హ్యాండిల్స్ మార్చలేదని చెప్పుకున్నారు. ఈ ఎమ్మెల్యేలు తమ చట్టపరమైన సలహాలతో స్పందిస్తున్నారు. కొందరు ఢిల్లీలో సుప్రీం కోర్టు న్యాయవాదులను సంప్రదించి, ప్రజల సేవ కోసం అధికార పార్టీలోకి వెళ్లామని, ద్రోహం చేయలేదని వాదిస్తున్నారు.
బీఆర్‌ఎస్ ఆధారాలతో కౌంటర్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వివరణలను తిరస్కరిస్తూ, 2025 సెప్టెంబర్ 13 (శనివారం) నాటికి స్పీకర్‌కు కౌంటర్ వాదనలు సమర్పించనుంది. పార్టీ నేతలు, ‘ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతల సమక్షంలో చేరారు, కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు, కట్టడి బెంచీల్లో కూర్చున్నారు‘ అని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో డిజిటల్ ఆధారాలు సేకరిస్తున్నారు. దానం నాగేందర్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. కడియం శ్రీహరి కూతురు బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చాక దానిని తిరస్కరించి కాంగ్రెస్‌లో చేరి పోటీచేసి గెలిచారు.
ఈ ఫిరాయింపుల వివాదం తెలంగాణ రాజకీయాల్లో అస్థిరతను తెలియజేస్తోంది. బీఆర్‌ఎస్ 2023లో 39 సీట్లతో రెండో స్థానంలో ఉండగా, 10 మంది ఎమ్మెల్యేలు చెరస్తే 29కి తగ్గుతుంది. ఇది పార్టీ బలాన్ని బలహీనపరుస్తుంది. కాంగ్రెస్‌కు (64 సీట్లు) ఇది అదనపు మద్దతు. కానీ డిస్క్వాలిఫికేషన్ అయితే బై–ఎలక్షన్లు జరగవచ్చు. అప్పుడు రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది. చట్టపరంగా ఫిరాయింపులను నిరోధిస్తుంది. కానీ ఎమ్మెల్యేలు ‘స్వచ్ఛందంగా‘ పార్టీ మారితే పార్టీ విలీనం ద్వారా మినాయింపు పొందుతారు. బీఆర్‌ఎస్ ఆధారాలు (వీడియోలు, సమావేశాలు) బలంగా ఉంటే స్పీకర్ డిస్క్వాలిఫికేషన్‌కు ఆమోదం ఇవ్వవచ్చు. స్పీకర్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపును తీసుకురావొచ్చు.