5 Countries dependent on India: ప్రపంచంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అమెరికా తో సహా దాదాపు అన్ని దేశాల్లో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే ఆసియా దేశాల గురించి చెప్తే భారతి చుట్టూ ఉన్న దేశాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధ్యక్షులు, ప్రధానులు మారిపోతున్నారు. మరికొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి, పాకిస్తాన్ కి మధ్య యుద్ధం కూడా సాగింది. అయితే ఈ యుద్ధంలో భారత్ పై చేయి సాధించింది. మరోవైపు రాజకీయంగా కూడా భారత్ పటిష్ట వ్యవస్థతో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల ప్రకారం మిగతా దేశాల కంటే భారత్ బలమైన ఆర్థిక, రాజకీయ వ్యవస్థను కలిగి ఉందని కొందరు చెబుతున్నారు. అయితే భారత్ సొంతంగా పటిష్టంగా ఉండడమే కాకుండా మరికొన్ని దేశాలకు కూడా ఎన్నో రకాలుగా సాయంగా ఉంటుందని చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే భారత్ లేకుంటే కొన్ని దేశాలు బతకలేవు అని కూడా అనుకోవచ్చు. మరి భారత్ పై పూర్తిగా ఆధారపడిన ఆ దేశాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
1. నేపాల్:
భారతదేశానికి ఉత్తరాన హిమాలయాల వైపు ఉన్న దేశం నేపాల్. ఇటీవలే ఇక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడి ఏర్పడిన విషయం తెలిసిందే. కొత్త ప్రధానిగా సుశీల కర్కీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా భారత్, నేపాల్ మధ్య ఉన్న సంబంధాల గురించి చర్చ జరుగుతుంది. భారత్ నుంచి నేపాల్ కు 65% వస్తువులు ఎగుమతి అవుతాయి. వీటిలో నిత్యవసర వస్తువులు కూడా ఉంటాయి. వీటిలో ఆయిల్, ఫుడ్ ఐటమ్స్, మెడిసిన్, వెహికల్, టెక్స్టైల్స్ వంటివి ఉంటాయి. ప్రతి ఏడాది నేపాల్ నుంచి 30 లక్షల మంది భారత్కు వలసలు వస్తూ ఉంటారు. అంతేకాకుండా భారత్ నుంచి నేపాల్, నేపాల్ నుంచి భారత్ కు రావడానికి ఎలాంటి వీసా అవసరం లేదు. 2025 సంవత్సరంలో నేపాల్ అభివృద్ధి కోసం భారత్ పదివేల కోట్ల రూపాయల రుణం అందించింది.
2. భూటాన్:
భారత్ కు పొరుగున ఉన్న మరో దేశం భూటాన్. ఈ దేశ అభివృద్ధి కోసం భారత్ నుంచి దాదాపు 70% ఎగుమతులు ఉంటాయి. భూటాన్ దేశంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం భారత్ అత్యధిక సాయం చేస్తుంది. అలాగే ఇక్కడ రోడ్లు భవనాల నిర్మాణం కోసం కూడా చేయూతను అందిస్తుంది. భూటాన్ దేశానికి అవసరమయ్యే ఫ్యూయల్, మెడిసిన్, ఆటోమొబైల్ వంటి అవసరాలను భారత్ నుంచే పొందుతుంది. భారత్ ఈ సహాయం చేయకపోతే ప్రజలు ఆహార కొరత కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. చైనాతో యుద్ధం జరిగినప్పుడు భూటాన్ దేశం సరసన భారత్ మిలటరీ కూడా అండగా నిలిచింది.
3. మాల్దీవులు:
పర్యాటక దేశంగా ప్రసిద్ధి చెందిన మాల్దీవులు కూడా భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఇక్కడికి భారత్ నుంచే ఎక్కువగా పర్యాటకులు వస్తారని ఇటీవల తెలిసిన విషయమే. ఎందుకంటే భారత్తో మాల్దీవులు కయ్యం పెట్టుకొని.. ఆ తర్వాత తిరిగి భారత్ కు సారీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. అయితే మాల్దీవుల్లో వ్యవసాయం ఉండదు. అందుకే ఇక్కడ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం భారత్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. 2020లో మాల్దీవుల్లో సైక్లోన్ కారణంగా భారత్ 400 మిలియన్ల తో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేసింది.
4. శ్రీలంక:
భారత్కు దక్షిణాన ఉన్న శ్రీలంక దేశం కూడా భారత్ పైనే ఆధారపడానికి వస్తుంది. 2020లో ఆ దేశంలో వచ్చిన సంక్షోభం కారణంగా ఏ దేశం సాయం చేయడానికి ముందుకు రాలేదు.. కానీ భారత్ నాలుగు బిలియన్ల డాలర్లతో ఇక్కడ పునర్వాసం ఏర్పాటు చేసింది.
5.ఖతర్:
అరబ్ దేశం అయినా ఖతర్ కూడా భారతదేశంపైనే ఆధారపడుతుందంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే రిచెస్ట్ దేశం అయినా ఇక్కడ ఫ్యూయల్ అత్యధికంగా ఉంటుంది. కానీ ఇక్కడ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం భారత్ సరఫరా చేస్తుంది. ప్రతి ఏడాది 25% ఆహార వస్తువులను ఖతర్ దేశానికి సరఫరా చేస్తుంది.