https://oktelugu.com/

Telangana BJP : నామినేషన్ల వేళ తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం!

కరీంనగర్‌ అభ్యర్థిగా కరీంనగర్‌ బండి సంజయ్, నాగర్‌ కర్నూల్‌ అభ్యర్థిగా భరత్‌ నామినేషన్ కార్యక్రమాలకు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరవుతారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2024 11:01 pm
    Telangana-BJP

    Telangana-BJP

    Follow us on

    Telangana BJP : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కీలక ఘట్టం గురువారం(ఏప్రిల్‌ 18న) ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు ఉదయం 9 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ విడతలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లకు, ఒక అసెంబ్లీ స్థానంతోపాటు 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు గురువారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

    తొలి రోజు నుంచే బీజేపీ నామినేషన్లు..
    నామినేషన్లు స్వీకరించే 8 రోజుల్లో మంచి ముహూర్తాలు తక్కువగా ఉండడంతో మొదటి రోజు నుంచే నామినేషన్లు దాఖలు చేసేందుకు టీ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. 17 స్థానాల్లో అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్లకు కేంద్రం మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కానున్నారు.

    బీజేపీ అభ్యర్థుల నామినేషన్ తేదీల ఇవీ..

    = 18న మెదక్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌ నగర్‌ బీజేపీ అభ్యర్థులు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డీకే.అరుణ నామినేషన్‌ వేయనున్నారు. మెదక్‌ రఘునందన్‌ రావు నామినేషన్ కు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్, ఈటల రాజేందర్‌ నామినేషన్‌కు కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ, డీకే.అరుణ నామినేషన్‌కు మరో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ హాజరుకానున్నారు.

    = ఏప్రిల్‌ 19న సికింద్రాబాద్, ఖమ్మం బీజేపీ అభ్యర్ధులు నామినేషన్‌ వేయనున్నారు. సికింద్రాబాద్‌ అభ్యర్థి కిషన్‌రెడ్డి, ఖమ్మం అభ్యర్థి వినోద్‌రావుల నామినేషన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరవుతారు.

    = ఇక ఈనెల 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబ్‌బాద్‌ అభ్యర్థులుగా బీజేపీ నేతలు నామినేషన్‌ వేయనున్నారు. జహీరాబాద్‌ అభ్యర్తి బీబీ.పాటిల్‌ నామినేషన్‌కు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్, మహబూబాబాద్‌ అభ్యర్థి సీతారాం నాయక్‌ నామినేషన్‌కు మరో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు హాజరవుతారు.

    = 23న భువనగిరి, 24న పెద్దపల్లి, ఆదిలాబాద్, హైదారాబాద్, వరంగల్‌ అభ్యర్ధుల నామినేషను దాఖలు చేస్తారు. పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్‌కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఆదిలాబాద్‌ అభ్యర్థి నగేశ్‌ నామినేషన్‌కు ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌సాయి, హైదారాబాద్‌ అభ్యర్థి మాధవీలత నామినేషన్‌కు మరో కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ఠాకూర్, వరంగల్‌ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ నామినేషన్‌కే అశ్విని వైష్ణవ్‌ హాజరవుతారు.

    = ఇక నామినేషన్ల చివరి రోజు అయిన ఏప్రిల్‌ 25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్‌ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేస్తారు. కరీంనగర్‌ అభ్యర్థిగా కరీంనగర్‌ బండి సంజయ్, నాగర్‌ కర్నూల్‌ అభ్యర్థిగా భరత్‌ నామినేషన్ కార్యక్రమాలకు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరవుతారు. నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి అరవింద్‌ నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్‌ హాజరు కానున్నారు.