https://oktelugu.com/

Nalgonda: నల్గొండలో ప్రేమజంటలను వదలని దుర్మార్గులు

నార్కట్‌పల్లి, అద్దంకి హైవేపై అడ్డా వేసే ఈ ముఠా.. దారిలో పోయే ప్రయాణికులు, ప్రేమికులను గమనిస్తుంది. అనుమానితులను వెంబడించి వారు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 8, 2024 / 08:57 AM IST
    Follow us on

    Nalgonda: ప్రేమ జంట కనిపిస్తే ఆ ముఠా పండ పంఇనట్లే. లవర్‌ను బెదిరిస్తూ.. అందిన కాడికి దండుకుంటోంది ఓ ముఠా. కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలో ఈ కొత్తరకం దందా సాగుతోంది. ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలోనే వారిని టార్గెట్‌ చేసి రహస్యంగా వీడియోలు తీస్తోంది. తర్వాత వారికి చూపించి బయట పెడతామని బెదరిస్తూ అందినకాడికి వసూలు చేస్తోంది. ఆరుగురితో కూడిన ఈ ముఠా డబ్బులు, నగలు, విలువైన వస్తువులు తీసుకునేవారు. జరిగిన విషయాలు బయటకు చెప్పుకోలేక ప్రేమ జంటలు మిన్నకుండిపోయేవి.

    హైవేపై అడ్డా..
    నార్కట్‌పల్లి, అద్దంకి హైవేపై అడ్డా వేసే ఈ ముఠా.. దారిలో పోయే ప్రయాణికులు, ప్రేమికులను గమనిస్తుంది. అనుమానితులను వెంబడించి వారు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తుంది. తర్వాత బెదిరించి కొట్టి వారి నుంచి నగలు, సెల్ ఫోన్లు, డబ్బులు గుంజుకునేవారు. అలా దోపిడీ చేసిన సొమ్ముతో జల్సాలు చేసుకునేవారు. విలాసాలకు ఖర్చు చేసేవారు. డిసెంబర్‌ చివరి వారంలో నార్కెట్‌పల్లి – అద్దంకి హైవే పక్కన నర్సింహారెడ్డి కాలనీకి వెళ్లే దారిలో ఓ జంటను బెదిరించి రూ.500 నగదు, 5 గ్రాముల బంగారు ఉంగరం లాక్కున్నారు. వ్యక్తిపై దాడి చేశారు.

    చెక్‌ పెట్టిన పోలీసులు..
    కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలో ఈ ముఠా ఆగడాలు పెరుగుతున్నాయి. ప్రేమికులు తిరిగే అడ్డాలను ఎంచుకుని అక్కడ మకాం వేసి.. ఈ దందా సాగిస్తున్నారు. దీనిపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ ముఠా ఆట కట్టించారు. ఆరుగురిని అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన కుంచం చందు, ప్రశాంత్‌, రాజు, చింతా నాగరాజు, అన్నెపూరి లక్ష్మణ్‌, శివరాత్రి ముఖేష్‌ను కోర్టులో హాజరుపర్చారు. వారి నుంచి బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్లు, ఖరీదైన వాచీలు, రెండు టీవీలు, డ్రిల్లింగ్‌ యంత్రం, ఇన్వర్టర్‌ స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ ఎస్పీ చందన దీప్తి తెలిపారు.