Heart Attack: 5 ఏళ్లకే గుండెపోటా? ఎంత దారుణం? చిన్నారి మృతి వెనుక కన్నీళ్లు పెట్టించే కథ

కోవిడ్‌ తర్వాత గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఎప్పుడు గుండెపోటు వస్తుంది.. ఏ వయసు వారికి వస్తుంది అన్న విషయంతో సంబంధం లేకుండా కుప్పకూలిపోతున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 16, 2024 11:28 am

Heart Attack

Follow us on

Heart Attack: గుండెపోటు రెండు మూడేళ్లుగా వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు తీస్తోంది. ఒకప్పుడు గుండెపోటు అంటే 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. అంతకన్నా తక్కువ వయసు వారిలో అరుదుగా మాత్రమే వచ్చేది. కానీ, ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా హార్ట్‌ ఎటాక్‌ చంపేస్తోంది. సంబరాల్లో ఉన్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు, నిద్రలో ఇలా అన్ని సమయాల్లో గుండెపోటు వస్తోంది. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది. జమ్మికుంట పట్టణానికి చెందిన రాజ–జమున దంపతుల కూతురు ఉక్కులు మంగళవారం(అక్టోబర్‌ 15న) ఉదయం కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గుండెపోటుగా గుర్తించి వరంగల్‌కు రెఫర్‌ చేశారు. వరంగల్‌ ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు చేస్తుండగానే గుండెపోటుతో చినపోయింది. పుట్టినప్పటి నుంచి చిన్నారకి గుండె సమస్య ఉండి ఉంటుందని వైద్యులు తెలిపారు. దానిని గుర్తించకపోవడంతోనే చినపోయిందని పేర్కొంటున్నారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కోవిడ్‌ తర్వాత హార్ట్‌ ఎటాక్‌..
ప్రపంచాన్ని మూడేళ్లు కరోనా అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోటుకుంటున్న ప్రజలను రెండేళ్లుగా గుండెపోటు భయపెడుతోంది. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

గుండెపోటు లక్షణాలు..

విపరీతమైన చెమట:
అతిగా చెమట రావడం గుండెపోటు లక్షణంగా భావించాలి. ఫ్యాన్, కూలర్, ఏసీ కింద ఉన్నా కూడా చెమటలు కారితే గుండె పోటుగా భావించి ఆస్పత్రికి వెళ్లాలి. అకారణంగా తరచూ చెమటలు పడుతుంటే.. మీ గుండె పనిచేయడానికి ఇబ్బంది పడుతుందని భావించాలి. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

ఛాతీలో నొప్పి:
గుండెపోటు లక్షణాల్లో మరో కీలక లక్షణం ఛాతీలో నొప్పి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఛాతీకి సంబందించిన ప్రతీ నొప్పి గుండెపోటు కాదు. కానీ, కొన్నిసార్లు గుండెలో మంట అనిపిస్తుంది. గుండెల్లో మంటను నిర్లక్ష్యం చేయొద్దు.

దవడ నొప్పి..
గుండెపోటు లక్షణాల్లో మరొకటి దవడ నొప్పి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గుండెపోటు రావడానికి ముందు భుజాలు, చేతులు, వీపు, మెడదగ్గర నొప్పితోపాటు దవడలో కూడా నొప్పిగా ఉంటుంది.

వెన్ను నొప్పి..
ఇక వెన్ను నొప్పి కూడా గుండెపోటు లక్షణమే. ఇది మహిళల్లో ఎక్కువ. విపరీతమైన వెన్నునొప్పి పురుషులు, స్త్రీలలో గుండెపోటు లక్షణంగా భావించాలి.