spot_img
Homeతెలంగాణతెలంగాణలో వింత సొరకాయ.. ఎంత పొడవో తెలుసా..?

తెలంగాణలో వింత సొరకాయ.. ఎంత పొడవో తెలుసా..?

 

సాధారణంగా కొన్ని కూరగాయలు వాటి పరిమాణాన్ని మించి పెరుగుతుండటం గురించి మనం వినే ఉంటాం. వంకాయలు, గుమ్మడికాయలు వాటి పరిమాణం కంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అయితే సొరకాయ తక్కువ పరిమాణంలో మాత్రమే పెరుగుతూ ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం వింత చోటు చేసుకుంది. దాదాపు మనిషి ఎత్తులో సొరకాయ ఉండటంతో దానిని చూసి షాక్ అవ్వడం గ్రామస్థుల వంతయింది.

గతంలో సొరకాయలు దాని పరిమాణం కంటే ఎక్కువగా పెరిగినట్టు వార్తలు రాలేదు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తగూడ మండలం, కొత్తపల్లి గ్రామంలో ఇంట్లో కూరగాయలను పండించే భూక్యా రాందన్ ఇంట్లో ఐదు అడుగుల సొరకాయ కాసింది. మొదట కొత్తపల్లి గ్రామస్తులు అది పొట్లకాయ అయి ఉంటుందని భావించారు. అయితే ఆ తరువాత పొట్లకాయ కాదు సొరకాయ అని తెలిసి షాక్ అయ్యారు.

5 అడుగుల సొరకాయ గురించి తెలిసి ఆ గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రజలు సైతం ఆ సొరకాయను చూసేందుకు తరలివస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నా తాము గతంలో అంత పెద్ద సొరకాయను చూడలేదని తెలుపుతున్నారు. నిపుణులు జన్యువులో మార్పుల వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు. పండించిన భూమి వల్ల కూడా ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయని తెలుపుతున్నారు.

అరుదుగా అలాంటి సొరకాయలు పండుతాయని.. వాటిని చూసి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియా వల్ల ఆ సొరకాయ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వింత సొరకాయ గురించి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper
Exit mobile version