రోజుకు పదిలక్షల మందికి కరోనా వాక్సిన్ ఇస్తాం

రోజుకు 10 లక్షల మందికైనా వ్యాక్సిన్ వేసేవిధంగా సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల అన్నారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ క్రికెట్ టోర్నీమెంట్ 2020-2021ను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల కరోనా సెకండ్‌ వేవ్‌పై స్పందించారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని, సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన […]

Written By: Suresh, Updated On : January 1, 2021 7:21 pm
Follow us on

రోజుకు 10 లక్షల మందికైనా వ్యాక్సిన్ వేసేవిధంగా సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల అన్నారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ క్రికెట్ టోర్నీమెంట్ 2020-2021ను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల కరోనా సెకండ్‌ వేవ్‌పై స్పందించారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని, సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి సాంపిల్స్ సీసీఎంబి కి పంపించామన్నారు. అందులో ఒక్కరికి ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని టెంపరేచర్ పెరిగితే కరోనా ఫస్ట్ ఫేస్ అంతం అవుతుందని యోచిస్తున్నామని తెలిపారు.