నేడు అమిత్ షాతో విజయశాంతి భేటి

కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సోమవారం బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత కిషన్ రెడ్డితో సమావేశమైన విజయశాంతి అధికారికంగా పార్టీలో మారలేదు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనే ఆమె కమలంలోకి చేరుతుందన్నారు. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ పార్టీ మారుతుందన్నారు. కానీ విజయశాంతి మాత్రం కాంగ్రెస్ ను వీడకపోవడంతో అందులోనే ఉంటారని అనుకున్నారు. అయితే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడంతో ఇక పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సోమవారం […]

Written By: Suresh, Updated On : December 6, 2020 12:20 pm
Follow us on

కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సోమవారం బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత కిషన్ రెడ్డితో సమావేశమైన విజయశాంతి అధికారికంగా పార్టీలో మారలేదు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనే ఆమె కమలంలోకి చేరుతుందన్నారు. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ పార్టీ మారుతుందన్నారు. కానీ విజయశాంతి మాత్రం కాంగ్రెస్ ను వీడకపోవడంతో అందులోనే ఉంటారని అనుకున్నారు. అయితే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడంతో ఇక పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సోమవారం విజయశాంతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లినఆమె ఈరోజు సాయంత్రం హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు.