తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. ఈ విషయం దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిరూపితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నాయకులు కలిసి కట్టుగా పనిచేసి తమ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. దీంతో వచ్చే ఎన్నకల్లోనూ బీజేపీ విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించిన కేంద్రం తెలంగాణలో మరొకరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి హోంశాఖలో సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాల్లో బీజేపీ ఎంపీలు గెలిచారు. వారిలో బండిసంజయ్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించారు. ఇప్పటికిప్పు ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించే అవకాశం లేదు. దీంతో నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావులు ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.