పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన సంఘటనపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఇప్పటి వరకు ఏలూరులో 227 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. ఇంకా మూర్చ, వాంతులతో బాధపడుతున్న బాధితులు పెరుగుతున్నారన్నారు. ప్రభుత్వాసుపత్రిలోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నామన్నారు. మరోవైపు ఇప్పటి వరకు 70 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారన్నారు. ఇంకా 76 మంది మహిళలు, 46 మంది చిన్న పిల్లలు మొత్తం 157 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. సమస్య తీవ్రత ఉన్న ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. కాగా నగరంలో నీటి సరఫరాలో ఎటువంటి కాలుష్యం లేదని, బాధితులకు చేసిన రక్త పరీక్షలో ఎలాంటి ఎఫెక్ట్ లేదన్నారు. అయితే కల్చర్ సెల్స్ సెన్సిటివిటి పరీక్ష రిజల్స్ట్ వస్తే కారణం తెలుస్తుందన్నారు.