గ్రేటర్ ఎన్నికలపై రేపు టీఆర్ఎస్ సమావేశం

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేష్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల కోసం ఓసారి సమావేశం నిర్వహించిన కేసీఆర్ మరోసారి బుధవారం ప్రగతి భవన్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని సీఎం ఆదేశించారు. గ్రేటర్ షెడ్యూల్ విడుదలయిన తరువాత ఈ సమావేశం నిర్వహిస్తుండడంతో పార్టీ ఏ విధంగా ఎన్నికల్లోకి వెళ్లాలనేది నిర్ణయం […]

Written By: Suresh, Updated On : November 17, 2020 2:42 pm
Follow us on

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేష్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల కోసం ఓసారి సమావేశం నిర్వహించిన కేసీఆర్ మరోసారి బుధవారం ప్రగతి భవన్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని సీఎం ఆదేశించారు. గ్రేటర్ షెడ్యూల్ విడుదలయిన తరువాత ఈ సమావేశం నిర్వహిస్తుండడంతో పార్టీ ఏ విధంగా ఎన్నికల్లోకి వెళ్లాలనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే దుబ్బాకలో సీటు పోగొట్టుకున్న టీఆర్ ఎస్ ఇక మళ్లీ ఆ మచ్చ రావద్దని పకడ్బందీగా ప్లాన్ వేస్తోంది. బీజేపీ గట్టి పోటీనిస్తుండడంతో ఆ ఫార్టీకి మరోసారి అవకాశం ఇవ్వకూడదని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు.