https://oktelugu.com/

హత్రాస్‌ ఘటనపై టీపీసీసీ నేడు మౌన దీక్ష..

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో జరిగిన బాలిక అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ నేత ప్రియాంక బాధితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వారి పట్ల ప్రవర్తించిన తీరుకు కాంగ్రెస్‌ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సైతం బీజేపీఐ విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మౌనదీక్ష పాటించనున్నారు. సాయంత్రం 4 నుంచి […]

Written By: , Updated On : October 5, 2020 / 07:55 AM IST
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో జరిగిన బాలిక అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ నేత ప్రియాంక బాధితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వారి పట్ల ప్రవర్తించిన తీరుకు కాంగ్రెస్‌ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సైతం బీజేపీఐ విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మౌనదీక్ష పాటించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉంటుందని ఉత్తమ్ తెలిపారు.  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.