
దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల్లో భాగంగా సోమవారం బెంగుళూరుతో ఢీల్లీ తలపడనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. గత రాత్రి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ 34 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలిచింది. డికాక్ (67) ఫామ్‌లోకి వచ్చాడు. సందీప్, సిద్ధార్త్ కౌల్ చెరో రెండు వికెట్లు తీశారు. హైదరాబాద్ అన్ని ఓవర్లు ఆడి 174 పురుగులు చేసింది. 7 వికెట్లు కోల్పోయింది. వార్నర్ (60) హాఫ్ సెంచరీ వృథా అయింది. బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. బౌల్డ్‌కు మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.