తిరుపతిపైనే టీడీపీ ఫోకస్‌

మరికొద్ది రోజుల్లోనే తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక నగారా మోగనుంది. ఈ ఉప ఎన్నికను ఇప్పటికే అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ స్థానాన్ని తమ ఖాతాల్లోనే వేసుకోవాలని అన్నిపార్టీలూ ఉవ్విల్లూరుతున్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ పెంచేశాయి. నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలన్నీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాయి. Also Read: జగన్ కు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. టీడీపీ […]

Written By: Srinivas, Updated On : December 17, 2020 10:18 am
Follow us on


మరికొద్ది రోజుల్లోనే తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక నగారా మోగనుంది. ఈ ఉప ఎన్నికను ఇప్పటికే అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ స్థానాన్ని తమ ఖాతాల్లోనే వేసుకోవాలని అన్నిపార్టీలూ ఉవ్విల్లూరుతున్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ పెంచేశాయి. నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలన్నీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాయి.

Also Read: జగన్ కు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. టీడీపీ ఇప్పటికే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించగా.. వైఎస్సార్‌సీపీ డాక్టర్ గురుమూర్తిని బరిలోకి దింపుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇక జనసేన, బీజేపీలు అభ్యర్థి ఎంపికపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పటికే టీడీపీ ఫీల్డ్‌లోకి దిగింది. పార్టీ కార్యాలయం ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలనూ నియమించింది. కీలక నేతలకు బాధ్యతలను అప్పగించింది. నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

రాబోవు ఎన్నికలకు సెమిస్‌లా భావిస్తున్న ఈ ఉప ఎన్నికను అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. నేతలతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ సూచనలు చేస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కోసం టీడీపీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఆరుగురితో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సీనియర్ నేతలకు బాధ్యతల్ని అప్పగించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఈ కమిటీని ప్రకటించారు.

Also Read: అమరావతి ఉద్యమానికి ఏడాది: త్యాగం చేసిన రైతులకు న్యాయమేది?

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు అచ్చెన్న తెలిపారు. ఈ సమన్వయ కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎన్. అమరనాథ్ రెడ్డి, బీద రవిచంద్ర, ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, జి.నరసింహ యాదవ్, పనబాక కృష్ణయ్య సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తుందని తెలిపారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్