పుష్కరాలకు వాళ్లు రావద్దు: తెలంగాణ ప్రభుత్వం

తుంగభద్ర పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతున్నందున తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాల్లో స్నానం చేయాలని సూచించింది. అలాగే పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్ల పైబడిన వారు పుష్కరాలకు రావద్దని తెలిపింది. కరోనా పరీక్ష చేయించుకొని నెగెటివ్ రిపోర్టుతో పుష్కరాలకు రావాలని, అవి లేకపోతే థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. […]

Written By: Suresh, Updated On : November 19, 2020 5:32 pm
Follow us on

తుంగభద్ర పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతున్నందున తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాల్లో స్నానం చేయాలని సూచించింది. అలాగే పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్ల పైబడిన వారు పుష్కరాలకు రావద్దని తెలిపింది. కరోనా పరీక్ష చేయించుకొని నెగెటివ్ రిపోర్టుతో పుష్కరాలకు రావాలని, అవి లేకపోతే థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని అవసరమైన నిధులను విడుదల చేసిందని ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కాగా డిసెంబర్ 1న పుష్కరాలు ముగియనున్నాయి.