అమెరికాలో జరిగిన రైలు ప్రమాదంలో తెలంగాణకు చెందిన వ్యక్తి మరణించాడు. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన ప్రవీణ్ అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. తాజాగా ఎడిసన్ నుంచి న్యూయార్క్ కు వెళ్తుండగా ఎడిసన్ సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ప్రవీణ్ మ్రుతదేహాన్ని అక్కడి నుంచి న్యూజెర్సీలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ప్రవీణ్ కుటుంబంలో విషాదం నెలకొంది.