పార్టీల పాదయాత్ర బాట

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసి రెండేండ్లైనా గడవలేదు. ఈ పాలన ఇంకా సగం కూడా పూర్తికాలేదు. అప్పుడే మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. అంతేకాదు.. అప్పుడే అధికారంలోకి ఎలా రావాలో ప్లాన్‌లు చేస్తున్నాయి. ఇందుకు ముఖ్యంగా పాదయాత్రలతో సక్సెస్‌ అవ్వాలని చూస్తున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి పాతయాత్రలు చేపట్టి సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. Also Read: ఓవైపు కరోనా.. మరోవైపు […]

Written By: Srinivas, Updated On : December 23, 2020 1:23 pm
Follow us on


తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసి రెండేండ్లైనా గడవలేదు. ఈ పాలన ఇంకా సగం కూడా పూర్తికాలేదు. అప్పుడే మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. అంతేకాదు.. అప్పుడే అధికారంలోకి ఎలా రావాలో ప్లాన్‌లు చేస్తున్నాయి. ఇందుకు ముఖ్యంగా పాదయాత్రలతో సక్సెస్‌ అవ్వాలని చూస్తున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి పాతయాత్రలు చేపట్టి సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.

Also Read: ఓవైపు కరోనా.. మరోవైపు తిరుమల వెంకన్న..!

తెలంగాణలో టీఆర్ఎస్‌కు మరోసారి ప్రజులు ఓట్లు వేయరన్న గట్టి నమ్మకంతో ఉన్న ప్రతిపక్ష పార్టీలు.. ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ పార్టీకి బలమైన నేత ఉంటే.. ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ బలాన్ని నేతలు పెంచుకునేందుకు పాదయాత్ర బాట పడుతున్నారు. తెలంగాణలో దూకుడు మీద ఉన్న బీజేపీ.. ఇప్పుడు కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కొత్తగా బాధ్యతలు తీసుకుని బీజేపీకి ఎప్పుడూ లేనంత ఊపు తీసుకొచ్చి పెట్టిన బండి సంజయ్.. మొదట బస్సు యాత్ర చేయబోతున్నారు. నియోజకవర్గాలు అన్ని తిరిగిన తర్వాత.. ఆయన పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలోనే ప్రణాళిక సిద్ధమవుతోందని అంటున్నారు.

జమిలీ ఎన్నికల ఛాన్స్‌ కూడా ఉండడంతో బండి సంజయ్ పాదయాత్ర తేదీలు కూడా ఖరారయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా ఎన్నికల వేడి ప్రారంభమయ్యే నాటికి పాదయాత్ర.. ప్రజల్లో చర్చనీయాంశంగా ఉండాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.

Also Read: ఈ కొత్త వైరస్‌ ఎలా వచ్చిందో తెలుసా..?

ఇక కాంగ్రెస్ నేతలూ పాదయాత్ర ఆలోచనే చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి గతంలో వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా కూడా పాదయాత్ర చేసి మరింత దగ్గరకు కావాలని యోచిస్తోంది. అంతేకాదు.. టీ పీసీసీ అధ్యక్షుడిని మరో వారంలో ప్రకటించనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేదా రేవంత్ రెడ్డి ఎవరు పీసీసీ చీఫ్ అయినా వారి ప్రథమ ప్రాధాన్యం పాదయాత్రకేనట. రేవంత్ రెడ్డి తన ప్రణాళికను ఇప్పటికే పార్టీ హైకమాండ్‌కు సమర్పించారు. తాను పార్టీకి పునర్‌వైభవం ఎలా తెస్తారనే నివేదిక ఇచ్చారు. అందులో పాదయాత్ర కీలకం. అలాగే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పోస్ట్ ఇస్తే పాదయాత్ర చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అంటే ఇద్దరి ప్లాన్లు పాదయాత్రనే. పాదయాత్ర ద్వారా ప్రజల్ని ఆకట్టుకుని..తమ బలాన్ని పెంచుకోవడంతో పాటు.. ప్రజల్ని ఆకట్టుకోవచ్చని నమ్ముతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్