
రైతులంగా సమన్వయ పరిచి సమావేశాలను నిర్వహించేందుకు నిర్మిస్తున్న రైతే వేదికలను ఈనెల 31న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం కేంద్రంలోని రైతువేదికను శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ తరువాత రైతులు, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లాకు చెందిన రైతులను ఇప్పటికే ఆహ్వానించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు.