https://oktelugu.com/

రోహిత్‌ను ఎందుకు పక్కన పెట్టినట్లు..?

టీమిండియా వైస్‌ కెప్టెన్‌.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. రోహిత్‌ గాయాల కారణంగా కొద్ది రోజులుగా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో కూడా అతనికి స్థానం కల్పించలేదు. దీంతో తీవ్ర దుమారం రేగుతోంది. కరోనా బ్రేక్‌‌ తర్వాత టీమిండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్‌‌ కాగా.. ఆ జట్టులో రోహిత్‌ పేరు లేదు. Also Read: సూర్యకుమార్‌‌ను ఎంపిక చేయరా? బీసీసీఐపై విమర్శలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 12:21 pm
    Follow us on

    Rohit Sharma Not Picked For India’s Tour of Australia

    టీమిండియా వైస్‌ కెప్టెన్‌.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. రోహిత్‌ గాయాల కారణంగా కొద్ది రోజులుగా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో కూడా అతనికి స్థానం కల్పించలేదు. దీంతో తీవ్ర దుమారం రేగుతోంది. కరోనా బ్రేక్‌‌ తర్వాత టీమిండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్‌‌ కాగా.. ఆ జట్టులో రోహిత్‌ పేరు లేదు.

    Also Read: సూర్యకుమార్‌‌ను ఎంపిక చేయరా? బీసీసీఐపై విమర్శలు

    రెండు నెలలకు పైగా సాగే ఈ టూర్‌‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌‌ మ్యాచ్‌‌లు జరగనున్నాయి. సునీల్‌‌ జోషి ఆధ్వర్యంలోని కొత్త సెలెక్షన్‌‌ కమిటీ వర్చువల్‌‌గా సమావేశమై.. ఈ సిరీస్‌‌ల కోసం వేర్వేరుగా జట్లను ఎంపిక చేసింది. అయితే తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న ‌ రోహిత్‌‌ శర్మను ఒక్క ఫార్మాట్‌‌కు కూడా ఎంపిక చేయకపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. రోహిత్ గాయం తీవ్రత గురించి తెలియజేయకుండా మూడు ఫార్మాట్లకు పక్కనపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదేదో కుట్ర అనే చర్చ ఊపందుకుంది.

    ఇదే ఐపీఎల్‌లో గాయపడ్డ మయాంక్ అగర్వాల్, నవ్‌దీప్ సైనీలకు అవకాశం కల్పించిన సెలక్టర్లు.. రోహిత్‌ను పక్కన పెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికితోడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ గాయం నుంచి కోలుకుంటున్నాడని, నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేశాడని ఓ వీడియోను షేర్ చేసింది. దాంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు బీసీసీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడ కండరాల గాయంతో ఉన్న ఆటగాడు నెట్స్‌లో ప్రాక్టీస్ ఎలా చేయగలడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశ్నించడంతో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది.

    Also Read: ఐపీఎల్ హీట్: ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లేవి..?

    దీంతో బీసీసీఐ కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది. టీమిండియా ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఇచ్చిన రిపోర్ట్ కారణంగానే భారత సెలక్టర్లు రోహిత్ ఎంపిక చేయలేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. టీమ్‌ని ఎంపిక చేసే ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్ రిపోర్ట్‌లను ఇవ్వాల్సిందిగా భారత సెలెక్షన్ కమిటీ.. నితిన్ పటేల్‌‌ను ఆదేశించిందని, అతను రోహిత్ శర్మ ఫిట్‌నెస్ రిపోర్ట్‌లో కనీసం 2-3 వారాల విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడని తెలిపారు. దాంతోనే రోహిత్ శర్మ పేరుని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా స్టార్‌‌ బ్యాట్స్‌మెన్‌ అయిన రోహిత్‌ను పక్కనపెట్టడంపై దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి విమర్శలు మాత్రం వస్తూనే ఉన్నాయి.