
‘నా చేతికి స్టీరింగ్ ఇవ్వండి.. బండి ఎలా వేగంగా నడపాలో చూపిస్తాను’ అని అంటుంటారు కారు లేని మిత్రులు. ఇప్పుడు సేమ్ టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అలానే తయారైంది. చంద్రబాబు తెరమీదకు వచ్చి యుద్ధం చేయాలని ప్రజలు కోరుకుంటుంటే.. ఆయన మాత్రం ప్రజల్లోకి రాకుండా పోరాడుతానంటున్నారు.
Also Read: తెలంగాణను వదిలి.. ఏపీపైనే విమర్శలు?
‘ఈ జగన్ సీఎంగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాడు.. అదే నేను అయితేనా ఇలా చేసేవాడినా.. ఉరుకులు పరుగులు పెట్టించేవాడిని.. నేను సీఎంగా ఉంటేనా ఆ కథే వేరు’ అంటూ ఫ్లాష్ బ్యాక్ రీల్స్ తిప్పుకుంటున్నారు. కానీ.. చంద్రబాబు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మరిచినట్లున్నారు పాపం. వరద సహాయ చర్యలు ఇలాగేనా చేసేది అంటూ బురద రాజకీయానికి చంద్రబాబు తెరతీశారు. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ .. ‘మీ పాలనలో కరవు తప్ప వరదలు ఎప్పుడు వచ్చాయి..’ అని బాబును నిగ్గదీశారు. అయినా చంద్రబాబు తగ్గడంలేదు. తన అనుభవం కట్టుకథలు అల్లుతూనే ఉన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జగన్ రెండో సారి తిరుమల దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. మొన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించారు. ఇలా జగన్ అపర భక్తుడిగా దేవుళ్ల, దేవతల సేవలో తరిస్తుంటే చంద్రబాబు ఆ దృశ్యాలు అసలు చూడలేకపోతున్నారట. గత నెలలో తిరుపతి పేరిట డిక్లరేషన్ అంటూ ఎంత గొడవ చేయాలో అంతా చేశారు, కానీ.. నో యూజ్. ఇక ఇప్పుడు ఏం చేయగలరు..!
Also Read: పబ్లిసిటీ కోసం కోట్ల తగలేస్తారా? ఏపీ సర్కార్ పై ప్రజల ఫైర్
జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబు పేరు పలకలేదు. కానీ.. చంద్రబాబు మాత్రం ఉదయం లేవగానే జగన్ మీదనే విరుచుకుపడుతుంటారు. దీన్ని చూసిన తమ్ముళ్లు ఇన్ని వేల సార్లు రోజుకు ఆయన పేరు వల్లెవేసి బాబే తెగ ప్రచారం చేస్తున్నారని సెటైర్లు కూడా వేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అని గట్టిగానే చంద్రబాబు గద్దిస్తున్నారు. కానీ జనాలకు అది అక్కసుగా అనిపిస్తోంది తప్ప ఆరోపణలా లేదు. మొత్తానికి చంద్రబాబు బాగా ఫస్ట్రేషన్ లో ఉన్నారనేది అందరికీ అర్థమవుతోంది. వాటి నుంచి ఎప్పుడు ఎలా బయటపడుతారో కాలమే నిర్ణయించాలి మరి.