కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ వద్ద నాయకులు ఆందోళనలు నిర్వహించారు. గవర్నర్ తమిళిసై ని కలవడానికి రాష్ట్ర వ్యవహారా ఇన్‌చార్జి ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే తమను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు.