https://oktelugu.com/

మరో ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమ్

ఆన్ లైన్ గేమ్ ను రద్దు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ప్రాణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆన్ లైన్ రమ్మీ వలలో పడి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన అభిలాష్ అనే విద్యార్థి కొంతకాలంగా ఆన్ లైన్ రమ్మీ ఆటకు బానిసయ్యాడు. ఈ క్రమంలో అందులో పెట్టుబడి పెట్టేందుకు అప్పులు చేశాడు. ఆ తరువాత అప్పలు పెరిగిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఒత్తిడి తట్టుకోలేని అభిలాష్ పురుగుల మందు తాగి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 29, 2020 / 09:18 AM IST
    Follow us on

    ఆన్ లైన్ గేమ్ ను రద్దు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ప్రాణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆన్ లైన్ రమ్మీ వలలో పడి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన అభిలాష్ అనే విద్యార్థి కొంతకాలంగా ఆన్ లైన్ రమ్మీ ఆటకు బానిసయ్యాడు. ఈ క్రమంలో అందులో పెట్టుబడి పెట్టేందుకు అప్పులు చేశాడు. ఆ తరువాత అప్పలు పెరిగిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఒత్తిడి తట్టుకోలేని అభిలాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.