https://oktelugu.com/

గృహప్రవేశం రోజు ముందుగా గోవుతో గృహప్రవేశం ఎందుకు చేస్తారు తెలుసా?

సొంత ఇల్లు కట్టుకోవాలి అన్నది ప్రతి ఒక్కరికి ఉండే కల. నిరంతరం కష్టపడి వారు తమ కలను సాకారం చేసుకుంటారు. ఈ విధంగా ఇల్లు కట్టుకొని తమ బంధువుల అందరిని పిలిచి గృహప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అయితే ఈ గృహప్రవేశ కార్యక్రమంలో ముందుగా గోవుతో గృహప్రవేశం చేయించడం ఎన్నో ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్నది. అయితే గోవుతోనే గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.. Also Read: సాయంత్ర సమయంలో తలుపులు మూసి ఉంచకూడదో తెలుసా? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 29, 2020 / 09:12 AM IST
    Follow us on

    సొంత ఇల్లు కట్టుకోవాలి అన్నది ప్రతి ఒక్కరికి ఉండే కల. నిరంతరం కష్టపడి వారు తమ కలను సాకారం చేసుకుంటారు. ఈ విధంగా ఇల్లు కట్టుకొని తమ బంధువుల అందరిని పిలిచి గృహప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అయితే ఈ గృహప్రవేశ కార్యక్రమంలో ముందుగా గోవుతో గృహప్రవేశం చేయించడం ఎన్నో ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్నది. అయితే గోవుతోనే గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

    Also Read: సాయంత్ర సమయంలో తలుపులు మూసి ఉంచకూడదో తెలుసా?

    గృహ ప్రవేశం జరిగే రోజు ముందుగా పూజను నిర్వహించి ఇంటిలోనికి గోవును తీసుకువెళ్తారు. తర్వాత ఆ ఇంటి యజమాని, ఇతర కుటుంబ సభ్యులు ఇంటిలోనికి ప్రవేశిస్తారు. మన హిందూ ఆచారం ప్రకారం గోవును సకలదేవతా స్వరూపం అని భావిస్తారు. అందువల్ల ముందుగా గోవు ద్వారా గృహప్రవేశం చేస్తే సకల దేవతలు మన ఇంటి లోనికి ప్రవేశిస్తారని భావిస్తారు.

    Also Read: 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

    మన ఇంటి లోనికి ప్రవేశించే ముందు గోవు కుడి కాలు పెట్టి లోపలికి వెళ్లి మన ఇంటిలో మూత్రం లేదా పేడ వేస్తే ఆ ఇంటికి ఎంతో శుభసూచకమని భావిస్తారు. అంతేకాకుండా ఇంటిలోనికి ప్రవేశించే ముందు గోమాతను సాక్షాత్తు ఇంటి మహాలక్ష్మి గా భావించి దిష్టి తీసి స్వాగతం పలుకుతారు. అయితే నగరాలలో అపార్ట్మెంట్లలో నివసించే వారు గోవును పైకి తీసుకు వెళ్లడం అసాధ్యం కాబట్టి, ఆ ప్రాంగణంలోనే ఆవు దూడలను అలంకరించి ఆవు మూత్రాన్ని తీసుకువెళ్లి ఇంటిలో చల్లుకుంటారు. ఈ విధంగా గృహప్రవేశం చేసేటప్పుడు గోమాతకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం