https://oktelugu.com/

కేసీఆర్ కు షాక్: ఆ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

  ఇటీవల నియామకమైన తెలంగాణ ఎమ్మెల్సీలకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు పంపింది. గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, సారయ్య,దయానంద్ ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. అయితే తన పేరును గవర్నర్ రెండు సార్లు ప్రతిపాదించగా ప్రభుత్వం పట్టించుకోలేదని ధనగోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రమంత్రి వర్గ సిఫార్సులను ఆమోదించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు నాలుగువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్సీలకు […]

Written By: , Updated On : December 23, 2020 / 02:13 PM IST
CM KCR
Follow us on

 

CM KCR

ఇటీవల నియామకమైన తెలంగాణ ఎమ్మెల్సీలకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు పంపింది. గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, సారయ్య,దయానంద్ ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. అయితే తన పేరును గవర్నర్ రెండు సార్లు ప్రతిపాదించగా ప్రభుత్వం పట్టించుకోలేదని ధనగోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రమంత్రి వర్గ సిఫార్సులను ఆమోదించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు నాలుగువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్సీలకు నోటీసులను పంపింది.