దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ దూసుకెళ్లింది. దీంతో ఇదే తరహా దూకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది అక్కడి బీజేపీ. రాజకీయాల్లో ఉద్ధండులైన కేసీఆర్‌కే చుక్కలు చూపించిన బీజేపీ పలు ఆర్థిక నేరాల ఆరోపణల కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఎదురు చెప్పే పరిస్థితిలో లేని జగన్ ని దెబ్బ కొట్టడం పెద్ద విషయం కాదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. దాంతోపాటు జనసేన కారణంగా తిరుపతిలో కుల సమీకరణాలు కూడా కలిసి వస్తుండడంతో అనూహ్యంగా బీజేపీ–జనసేన కూటమి రేసులోకి దూసుకొచ్చింది.
Also Read: పార్టీల పాదయాత్ర బాట
అయితే ఇంతలోనే పలు ఛానల్స్‌లో బీజేపీ–జనసేనల మధ్య విభేదాలు వచ్చాయంటూ కథనాలు వచ్చాయి. బీజేపీ–జనసేన మధ్య మిత్ర భేదం అంటూ ఓ ఛానల్.. జనసేనకు బీజేపీ హ్యాండిచ్చింది అంటూ ఒకరు, బీజేపీకి జనసేన కౌంటర్ ఇచ్చింది అని మరొకరు, కత్తులు దూసుకుంటున్న బీజేపీ–జనసేన అని ఇంకొకరు కథనాలు ప్రసారం చేశారు. ఆ రెండు పార్టీలకు కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే 2019 ఎన్నికలకు ముందు జనసేన కానీ బీజేపీ కానీ నిర్వహించిన బహిరంగ సమావేశాలను సైతం ప్రసారం చేయని ఈ ఛానల్స్ సడెన్‌గా కూటమి మీద ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందన్నది తెలియకుండా ఉంది.
అక్కడ ఉన్నది ఒకే ఒక్క సీటు. కాబట్టి ఈ రెండు పార్టీలలో ఎవరో ఒకరే చివరికి పోటీ చేస్తారు మరొక పార్టీ ఆ పార్టీకి మద్దతు ఇస్తుంది. అయితే ఛానల్స్ ప్రసారం చేస్తున్న కథనాల కారణంగా సోషల్ మీడియాలో కొందరు అభిమానులు కూడా పవన్ లేకుండా బీజేపీ గెలవదు అని, బీజేపీ లేకుండా జనసేన గెలవదు అని మాటలకు పోతున్నారు. కొందరు జనసేన అభిమానులైతే ప్రతిసారీ బీజేపీకి మద్దతు ఇచ్చే దానికి బీజేపీతో పొత్తు ఎందుకు అని నిష్ఠూరాలు కూడా పోతున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య తిరుపతి ఎన్నిక ఎంతో కొంత గ్యాప్ తీసుకొచ్చిన మాట వాస్తవమే.
Also Read: ఓవైపు కరోనా.. మరోవైపు తిరుమల వెంకన్న..!
2019 ఎన్నికల్లో పోటీచేసినా జనసేన పెద్దగా సత్తాచూపలేకపోయింది. ఒంటరిగా బరిలోకి దిగినా ఆ ఎన్నికల్లో ఎదురైన ఛేదు అనుభవంతోనైనా క్యాడర్‌ను నిర్మించుకోలేకపోయింది. అయితే.. జనసేన– బీజేపీతో పొత్తు పెట్టుకోవడం రాజకీయంగా మంచి వ్యూహమే. అయితే జీహెచ్ఎంసీ తిరుపతి వంటి ఒకటి లేదా రెండు ఎన్నికలను సాకుగా చూపి ఇతర పార్టీల అడుగులకు మడుగులు ఒత్తే చానల్స్ చేస్తున్న మిత్రభేదం కార్యక్రమాలను చూసి ట్రాప్ లో పడకండి అంటూ జన సైనికులకు రాజకీయ విశ్లేషకులతోపాటు ఆ పార్టీ నేతలు కూడా హితవు పలుకుతున్నారు. మొత్తానికి బీజేపీ–జనసేన మధ్య నెలకొన్ని ఈ విభేదాలకు ఆయా పార్టీల అధినేతలే స్పష్టత ఇవ్వాలి మరి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్