
కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశపడి కొందరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన పోలికేక సభలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నకల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామని డిపాజిట్లు రాని నేతల పెత్తనం కాంగ్రెస్ లో ఉండదన్నారు. గిట్టుబాటు ధర కోసం పోరాడిన రైతులకు బేడీలు వేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. గిట్టుబాటు ధర రాకుంటే పంటకు నిప్పు పెట్టాల్సిన పరిస్థతి వచ్చిందని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తే అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు.