
తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడికి మద్దతు ప్రభుత్వం అందిస్తున్న ‘రైతుబంధు’పథకం నగదు నేరుగా రైతు ఖాతాల్లోకి జమ కానుంది. అయితే రైతులు బ్యాంకుకు వెళ్లి తమ డబ్బులను తీసుకోవడానికి ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఈసారి రైతు బంధు నగదును పోస్టాఫీసు ద్వారా కూడా రైతుబంధు నగదును తీసుకేనేలా ఏర్పాట్లు చేసింది. లబ్ధిదారులకు పోస్టాఫీసులో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేకుండా తమ నగదును తపాలాశాఖలోని మైక్రో ఏటీఎం సేవలను రైతులకు అందించనున్నారు. తపాలాశాఖకు తెలంగాణలో 4,860 పోస్టాఫీసులున్నాయి. అన్ని కార్యాలయాలకు ప్రత్యేకంగా ఓ సెల్ ఫోన్, బయో మెట్రిక్ డివైజ్ ను ఇచ్చారు. దీంతో రైతులు నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి తమ నగదును తీసుకోవచ్చు.