తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌‌ఎస్‌ సంగతి ఏం చేయబోతోంది..?

తెలంగాణ సర్కార్‌‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి, ఎల్‌ఆర్‌‌ఎస్‌లను తీసుకొచ్చింది. కానీ.. ఈ రెండింటిపైనా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే చేసేందుకు సర్కార్‌‌ దిగొచ్చింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎల్‌ఆర్‌‌ఎస్‌కు సంబంధించి పలు ప్రత్యామ్నాయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయట. ఇప్పటికే ఒకసారి కంటే ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్‌ జరిగిన […]

Written By: Srinivas, Updated On : December 27, 2020 10:43 am
Follow us on


తెలంగాణ సర్కార్‌‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి, ఎల్‌ఆర్‌‌ఎస్‌లను తీసుకొచ్చింది. కానీ.. ఈ రెండింటిపైనా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే చేసేందుకు సర్కార్‌‌ దిగొచ్చింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎల్‌ఆర్‌‌ఎస్‌కు సంబంధించి పలు ప్రత్యామ్నాయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయట. ఇప్పటికే ఒకసారి కంటే ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్‌ జరిగిన వాటిని మళ్లీ అనుమతించాలని.. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు జరగని వాటికి మాత్రం ఎల్‌ఆర్‌‌ఎస్‌ చట్టం వర్తింపజేయాలని ఆలోచనలో ఉందట.

Also Read: టీపీసీసీ చీఫ్‌ కొండా సురేఖ..?

మరోవైపు రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఆగిపోవడంతో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో తెలంగాణలో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటి ప్రక్రియ అలాగే ఆగిపోయింది. కార్డు పద్ధతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ ఎల్ఆర్ఎస్ లేని వాటి రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో ఆయా ఆస్తుల అమ్మకం, కొనుగోలుదారులు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. దీనికి పరిష్కారం చూపడానికి ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లస్టర్లు, గ్రూపులుగా విభజించి పరిష్కరించాలని పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఫీర్జాదిగూడ నగరపాలికలో పైలట్ పద్ధతిన కొంత ప్రక్రియ కూడా చేశారు. భవన నిర్మాణ సమయంలోనే ఎల్ఆర్ఎస్మొత్తం చెల్లించేలా నిబంధన పెట్టడమా లేదా? అనే అంశంపై యోచిస్తున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే కొనుగోలు దారుడి నుంచి ప్రత్యేకంగా అఫిడవిట్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: కొత్త ట్రాఫిక్ రూల్స్.. బండి ఉంటేనే ప్రమాదం.. అమ్మేస్తే పోలా..!

అంతేకాదు.. రిజిస్ట్రేషన్‌ సమయంలో కొనుగోలుదారు నుంచి ప్రత్యేకంగా అఫిడవిట్‌ తీసుకోనున్నట్లు తెలిసింది. అందులో రిజిస్టర్డ్‌ స్థలం ప్రభుత్వ భూమి కాదని.. శిఖం స్థలం కాదని.. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో లేదని.. నాలా ఆక్రమణ లేదని.. ఇలా పలు అంశాలను స్పష్టం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భూమి విలువ ప్రాతిపదికగా ప్లాట్ల విస్తీర్ణం మేరకు క్రమబద్ధీకరణ చార్జీలను ప్రభుత్వం నిర్దేశించింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్