దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ మొదల యిం దని ఢిల్లీ ఆరోగ్యమంత్రి చెబుతున్నారు. మరోపక్క ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లకు కొరత ఏర్పడుతోంది. మరో నెల రోజుల పాటు కరోనా కేసులు అమాంతం పెరిగే అవ కాశాలున్నాయని తెలుస్తోంది.
ఢిల్లీలో థర్డ్ వేవ్ కరోనా వైరస్ మొదలైందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడిం చారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దాటి.. థర్డ్ వేవ్ లోకి ప్రవేశించిందని. అది కూడా పీక్ స్టేజ్ లో ఉందని తెలిపారు. అయితే మళ్ళీ లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్నామని, ప్రతి వ్యక్తీ మాస్కులు ధరించడమే పరిష్కారమని ఆయన చెప్పారు.
Also Read: ఎట్టకేలకు పంతం వీడిన ట్రంప్.. బైడెన్ కు లైన్ క్లియర్..!
మాస్క్ ను నిర్లక్ష్యం చేసిన దేశాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. ఐరోపా నుంచి వస్తున్న నివేదికలను బట్టి సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న దేశాల్లో ప్రతీ 17 సెకన్లకు ఒక మరణం సంభవిస్తోంది. గత వారంలోనే 29 వేల మంది చనిపోయారు. ఇప్పటికే మెక్సికోలో లక్ష మందిపైగా మత్యువాతపడ్డారు. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ విధించారు. భారత్ లో సెకండ్ వేవ్ తీవ్రంగా వస్తే అది సునామీగా మారే ప్రమాదముంది. ఢిల్లీ ముంబై తదితర చోట్ల కేసులు పెరుగుతున్నాయి. ప్రజల్లో కనిపిస్తోన్న నిర్లక్ష్యం వైరస్ మ్యుటేటయ్యే అవకాశాలు ఇంకా వ్యాక్సిన్ సిద్ధం కాకపోవడం వంటివి సవాల్గా మారతాయి. వైరస్ స్ట్రెయిన్లు మార్పు చెందుతూ ఉంటే మరణాల సంఖ్య పెరుగుతుంది.
యూరప్ దేశాలు కరోనా ఫస్ట్ వేవ్ ను త్వరగానే తగ్గించేశాయి. వైరస్ వ్యాప్తిని సమర్థంగా అదుపు చేశాయి. ఆ తర్వాత కరోనా నివారణకు వేసవి రూపంలో మంచి అవకాశం వచ్చినా యూరప్ దేశాలు ఉపయోగించుకోలేకపోయాయని ప్రస్తుతం సెకండ్ వేవ్లోనూ మేల్కోకపోతే థర్డ్ వేవ్ మరింత భీకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. దక్షిణ కొరియా లాంటి ఆసియా దేశాలు కరోనా వ్యాప్తి నియంత్రించడంలో విజయం సాధించాయని డేవిడ్ ప్రశంసించారు. అక్కడ అత్యంత తక్కువ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు.
Also Read: మళ్లీ కేసీఆర్ జాతీయ రాజకీయాలు.. వర్కవుట్ అవుతాయా?
కొద్ది రోజులుగా రాజధానిలో రోజుకు వందమంది వరకు కరోనా రోగులు చనిపోతున్నారు. మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో నగరంలో 95 మంది కరోనా రోగులు మృతి చెందారు. హస్తినలో కేసులు పెరిగిపోతుండటం పై హోం మంత్రి అమిత్ షా సైతం ఆందోళన వ్యక్తం చేసి.. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే నగర హాస్పిటల్స్ లో 750 ఐ సీ యూ పడకలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రోజువారీ కరోనా టెస్టులను ప్రస్తుతమున్న 60 వేల నుంచి లక్షకు పెంచుతామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
రాబోయే రోజుల్లో ఢిల్లీలో రోజుకు 15వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 20 నుంచే దేశ రాజధానిలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే పెరుగుతున్న రోగులకు వైద్యం అందించటానికి రాజధానిలో బెడ్లు ఉన్నాయి కానీ.. ఐసీయూ బెడ్లకు కొరత ఏర్పడింది. మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్