
కరోనా వైరస్ నిరోధానికి హైదాబాద్ లోని భారత్ బయోటిక్ సంస్థ వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు ప్రధాన మంత్రి మోడీ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీం పేటకు వస్తారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తరుపున ప్రముఖులు ప్రచారానికి వస్తున్నారు. ఈ సమయంలో మోడీ హైదరాబాద్ కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ప్రచారంలో పాల్గొంటారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.