Site icon OkTelugu

రేపు ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం శుక్రవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశమై అసెంబ్లీ సమావేశంలో జరిగే చర్చపై దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో నివర్ తుఫాను, పంట నష్టం అంచనాలపై సీఎంకు మంత్రులు వివరించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 నుంచి సాగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేశారు. మొత్తం ఐదురోజులపాటు ఈ సమావేశాలు జరిగే నేపథ్యంలో 30న ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Exit mobile version