
స్వచ్చమైన, పరిశుభ్రం చేిన ఆరోగ్యవంతమైన మంచినీటిని తెలంగాణ ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పధకాన్ని ప్రారంభించారని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 46వేల కోట్ల వ్యయంతో మొదలు పెట్టి 34 వేల కోట్లు ఖర్చుచేసి 99శాతం గ్రామాలకు మంచినీటిని కేవలం రెండేళ్లలో అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. వరంగల్ మహానగర పరిధిలోని హసన్‌పర్తి, భిమారం,లో మిషన్‌భగీరథ మానిటరింగ్ సెల్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.