
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ పూరిగుడిసె ఇంటికి నెలకు రూ.1.49 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. అనంతపురం జిల్లా కనేకల్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కె. నాగమ్మ రోజు కూలీ. ఆమెకు ఓ చిన్న ఇల్లు ఉంది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పక్కనే ఆమె ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి ఏకంగా రూ.1,49,034 కరెంటు బిల్లు వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు ఏంటంటే, ఓ ఫ్యాన్, ఓ టీవీ, ఓ ట్యూబ్ లైట్. ఈ మూడింటికే లక్షన్నర కరెంటు బిల్లు వచ్చింది.