డేటింగ్ యాప్స్ ను వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.?

స్మార్ట్ ఫోన్ల రాకతో ఫోన్లలో కొత్త కొత్త యాప్స్ యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. యువత ఎక్కువగా డేటింగ్ యాప్స్ ను వినియోగిస్తున్నారు. అయితే ఈ డేటింగ్ యాప్స్ ను ఉపయోగించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డేటింగ్ యాప్ ను వినియోగించడం వల్ల 16 లక్షల రూపాయలు నష్టపోయాడు. చాలామంది డేటింగ్ యాప్స్ లో ఫోటోలు, వ్యక్తిగత సమాచారం ఇతరులకు కనపడేలా అందుబాటులో ఉంచుతున్నారు. Also […]

Written By: Navya, Updated On : December 19, 2020 12:11 pm
Follow us on


స్మార్ట్ ఫోన్ల రాకతో ఫోన్లలో కొత్త కొత్త యాప్స్ యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. యువత ఎక్కువగా డేటింగ్ యాప్స్ ను వినియోగిస్తున్నారు. అయితే ఈ డేటింగ్ యాప్స్ ను ఉపయోగించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డేటింగ్ యాప్ ను వినియోగించడం వల్ల 16 లక్షల రూపాయలు నష్టపోయాడు. చాలామంది డేటింగ్ యాప్స్ లో ఫోటోలు, వ్యక్తిగత సమాచారం ఇతరులకు కనపడేలా అందుబాటులో ఉంచుతున్నారు.

Also Read: కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ శుభవార్త.. ఆ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు..?

అయితే కొందరు అవతలి వ్యక్తుల నుంచి పూర్తి సమాచారం, వ్యక్తిగత ఫోటోలు సేకరించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ మోసాలు చేస్తున్నారు పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు డేటింగ్ యాప్ ద్వారా శ్వేత అనే అమ్మాయి పరిచయమైంది. ఈ నెల 3వ తేదీన శ్వేతతో టెక్కీకి పరిచయం ఏర్పడగా పరిచయమైన కొన్ని రోజులకే వ్యక్తిగత అవసరాల నిమిత్తం 2,000 రూపాయలు కావాలని శ్వేత టెక్కీని కోరింది.

Also Read: గ్యాస్ కుకింగ్ తో పిల్లలకు ఆ సమస్యలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక..?

నగదును తన నంబర్ కు పంపవద్దని తన స్నేహితురాలు నిఖితకు పంపాలని శ్వేత చెప్పగా టెక్కీ ఆ విధంగానే పంపాడు. ఆ తరువాత శ్వేత నగ్నంగా కాల్ చేయగా అతడు కూడా అదే విధంగా ఆమెతో కాల్ మాట్లాడాడు. ఆ వీడియో కాల్ ను రికార్డ్ చేసిన శ్వేత ఆ వీడియోను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడింది. ఆ తరువాత మరికొంత మంది యువతులు సైతం టెక్కీ ఫోన్ కు కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించేవారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

అలా యువకుని నుంచి 16 లక్షల రూపాయలను ముగ్గురు యువతులు దోచుకున్నారు. అయితే అప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో సదరు యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.