
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది.. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగిరేది గులాబీ జెండాయేనని అంచనా వేసినా..! ఫలితాలు మాత్రం మరోలా వచ్చాయి. ఎక్స్‌అఫిషియో ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నా.. మరొకరి సాయం తీసుకోకుండా మేయర్ పీఠం ఎక్కలేని పరిస్థితి.. ఈ నేపథ్యంలో రేపు కీలక సమావేశానికి సిద్ధమయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… రేపు తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం జరగనుంది… ఈ సమావేశానికి కార్పొరేటర్లతో పాటు… గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు.. ఇక, ఈ భేటీలో గ్రేటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉండగా… పొత్తులపై కూడా ఓ నిర్ణయానికి వస్తారా? అనే చర్చ సాగుతోంది.. కాగా, గ్రేటర్ మేయర్‌కు మరో రెండు నెలల సమయం ఉంది.