హైదరాబాద్ కు పయనమైన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లలో మూడు రోజుల పాటు పర్యటించి తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కేంద్రమంత్రులతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో సమావేశమై రాష్ట్రంలో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులను కోరుతూ ఇక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరారు. దీంతో కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రిసైతం కేసీఆర్ విన్నపాలపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పర్యటనను ముగించుకొని హైదరాబాద్ కు పయనమయ్యారు. కాగా కేసీఆర్ కేంద్రమంతులను గానీ, ప్రధానిని గానీ […]

Written By: Suresh, Updated On : December 13, 2020 2:38 pm
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లలో మూడు రోజుల పాటు పర్యటించి తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కేంద్రమంత్రులతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో సమావేశమై రాష్ట్రంలో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులను కోరుతూ ఇక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరారు. దీంతో కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రిసైతం కేసీఆర్ విన్నపాలపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పర్యటనను ముగించుకొని హైదరాబాద్ కు పయనమయ్యారు. కాగా కేసీఆర్ కేంద్రమంతులను గానీ, ప్రధానిని గానీ కలిసేటప్పడు ఏ ఒక్క ఎంపీనీ వెంట తీసుకెళ్లలేదు. ప్రతీ సమావేశం ఏకాంతంగానే జరిపారు. దీంతో ఆయన కేంద్రాన్ని కలవడంపై చర్చనీయాంశంగా మారింది.