https://oktelugu.com/

పవన్ పక్కన అంటే వామ్మో చేయమంటున్న హీరోలు!

పూర్తిస్థాయి పొలిటీషియన్ గా మారిన పవన్ కళ్యాణ్ వెండితెర రీఎంట్రీ ఇస్తారని అభిమానులు కూడా ఊహించలేదు. అనూహ్యంగా గత ఏడాది చివర్లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పేరుతో కొత్త మూవీ ప్రకటించారు. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ కి ఈ నిర్ణయం భలే కిక్ ఇచ్చింది. వకీల్ సాబ్ తరువాత వరుసగా నాలుగు ప్రాజెక్ట్స్ ప్రకటించి మరింత షాక్ కి గురిచేశారు. పవన్ ప్రకటించిన చిత్రాలలో అయ్యప్పనుమ్ కోషియుమ్ రిమేక్ ఒకటి. మలయాళ హిట్ మూవీకి […]

Written By:
  • admin
  • , Updated On : December 13, 2020 / 02:34 PM IST
    Follow us on


    పూర్తిస్థాయి పొలిటీషియన్ గా మారిన పవన్ కళ్యాణ్ వెండితెర రీఎంట్రీ ఇస్తారని అభిమానులు కూడా ఊహించలేదు. అనూహ్యంగా గత ఏడాది చివర్లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పేరుతో కొత్త మూవీ ప్రకటించారు. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ కి ఈ నిర్ణయం భలే కిక్ ఇచ్చింది. వకీల్ సాబ్ తరువాత వరుసగా నాలుగు ప్రాజెక్ట్స్ ప్రకటించి మరింత షాక్ కి గురిచేశారు. పవన్ ప్రకటించిన చిత్రాలలో అయ్యప్పనుమ్ కోషియుమ్ రిమేక్ ఒకటి. మలయాళ హిట్ మూవీకి తెలుగు రిమేక్ గా ఈ చిత్రం ఉండనుంది.

    Also Read: పుష్ప కోసం రంగస్థలం టెక్నిక్

    కథ రీత్యా ఇద్దరు హీరోల మధ్య పోటాపోటీ యుద్ధం ఉంటుంది. ఇలాంటి కథ పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా సూటవుతుందనే అనుమానాలు మొదటి నుండి అభిమానులలో మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ స్థాయి ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా ప్రస్తుతం ఖాళీగా లేరు. దానికి తోడు అయ్యప్పనుమ్ కోషియుమ్ కథకు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసే బాధ్యత త్రివిక్రమ్ తీసుకున్నారట. పరిశ్రమలో పవన్ కి త్రివిక్రమ్ అత్యంత సన్నిహితుడు కావడంతో పవన్ పాత్రను త్రివిక్రమ్ ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడం ఖాయం. అంటే మరో హీరో రోల్ పవన్ పాత్ర ముందు డామినేట్ అయ్యే అవకాశం కలదు.

    ఈ నేపథ్యంలో కొద్దోగొప్పో ఫార్మ్ లో ఉన్న కుర్రహీరోలు కూడా ఈ చిత్రంలో నటించాడని ఆసక్తి చూపడం లేదట. నిర్మాతలు హీరోల చుట్టూ తిరుగుతున్నా, ఏవో కారణాలు చెప్పి తప్పుకుంటున్నారని పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది. దీనితో ముందుగా ఒప్పుకున్న చిత్రాలను కూడా పక్కనబెట్టి, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేద్దామనుకుంటున్న పవన్ కోరిక వెంటనే తీరేలా కనిపించడం లేదని సమాచారం.

    Also Read: ‘దుర్గమతి’ బాక్సాపీస్ వద్ద చేతులు ఎత్తేసింది !

    మరో వైపు పవన్ ఫ్యాన్స్ కూడా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ పట్ల అంత ఆసక్తి చూపడం లేదు. కారణం తమ హీరోని వెండితెరపై మరో హీరో డామినేట్ చేసేలా చూపించినా వారు తట్టుకొనే పరిస్థితి లేదు. పవన్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కి కమిటైన నేపథ్యంలో పవన్ తో సవాల్ విసిరే ఆ హీరో ఎవరు కానున్నారో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్