
హైదరాబద్‌లో సిటి బస్సుల రవాణాపై కేసీఆర్ గురువారం జీహెచ్‌ఎంసీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ంచారు. అనంతరం సిటీ బస్సులను నడిపేందుకు అనుమతినిస్తూ ప్రకటన చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 25 శాతం బస్సులు నడిపించాలని ఆర్టీ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాధి విస్తరణతో లాక్‌డౌన్ ప్రకటించిన వేళ రాష్ట్రానికి మొత్తం తాళం పడింది. అందులో భాగంగా బస్సులు మొత్తం డిపోల్లోనే నిలిచాయి. అయితే అన్‌లాక్ 1.0 నుంనే ఆర్టీసీ బస్సులకు అనుమతినిచ్చినా సిటి బస్సులకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇటీవల దేశంలోని కొన్ని మెట్రో పాలిటన్ సిటీల్లో సిటి బస్సులు ప్రారంభమయ్యాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బస్సులను నడిపించారు.