
టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను నాశనం చేసే పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసీఆర్‌కు నమ్మకం లేదన్నారు.బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటేనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకుల డ్రామాలను ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ విస్మరించారన్నారు. ప్రజలను మభ్యపెడుతున్న కారు పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి పట్టలేదని బండి సంజయ్ పేర్కొన్నారు.