ఘనంగా కేసీఆర్ దత్తపుత్రిక వివాహం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం చరణ్ రెడ్డితో సోమవారం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ వివామానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిన్న ప్రత్యూషను పెళ్లికూతురు చేసేందుకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వయంగా వెళ్లారు. ఆమెతో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. గతంలో ప్రత్యూష పినతల్లి […]

Written By: Suresh, Updated On : December 28, 2020 12:59 pm
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం చరణ్ రెడ్డితో సోమవారం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు నిర్వహించారు. ఈ వివామానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిన్న ప్రత్యూషను పెళ్లికూతురు చేసేందుకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వయంగా వెళ్లారు. ఆమెతో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. గతంలో ప్రత్యూష పినతల్లి చేతిలో చిత్ర హింసలకు గురైన తరువాత ఆమె పరిస్థితిని చూసిన కేసీఆర్ చలించిపోయారు. దీంతో ఆమెను దత్తపుత్రికగా స్వీకరించి ఆమె బాగోగులను చూసుకున్నారు. ఆ తరువాత ఆమె నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తోంది.