https://oktelugu.com/

కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి..!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతుండగా కాంగ్రెస్ వెనుకబడి పోతుంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కొత్త పీసీసీ ఎంపికపై దృష్టిసారించిన సంగతి తెల్సిందే. పీసీసీ రేసులో తాను సైతం ఉన్నట్లు ప్రకటించుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈక్రమంలోనే తాజాగా మరోసారి కేసీఆర్ పై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ పంట సాగు విషయంలో నియంత్రిత సాగు విధానాన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 / 01:14 PM IST
    Follow us on

    తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతుండగా కాంగ్రెస్ వెనుకబడి పోతుంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కొత్త పీసీసీ ఎంపికపై దృష్టిసారించిన సంగతి తెల్సిందే.

    పీసీసీ రేసులో తాను సైతం ఉన్నట్లు ప్రకటించుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈక్రమంలోనే తాజాగా మరోసారి కేసీఆర్ పై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

    ఇటీవల సీఎం కేసీఆర్ పంట సాగు విషయంలో నియంత్రిత సాగు విధానాన్ని ఎత్తివేస్తున్నామని.. అలాగే ఇకపై గ్రామాల్లో పంట కొనుగోళ్లు ఉండవని.. ప్రభుత్వమేమీ వ్యాపార సంస్థ కాదంటూ చెప్పుకొచ్చారు. దీనిపై జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

    సీఎం కేసీఆరే రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. రైతులను సన్నధాన్యం పండించామని చెప్పిన కేసీఆర్ వాటిని ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు విని రైతులు భారీగా నష్టోపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

    తాను కూడా రైతుననే చెప్పుకునే కేసీఆర్ అన్నదాతలకు మేలు చేకూర్చే నిర్ణయాలి తీసుకోవాలి? కాదా ఇవేం పనులంటూ నిలదీశారు.లేదంటే సీఎంగా నిర్ణయం తీసుకుంటే అందరితో అభిప్రాయాలను పరిణలోకి తీసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.

    నిన్నటి వరకు కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లొచ్చాక మాటమారుస్తున్నారని ఆరోపించారు. కేంద్ర చట్టాలకు కేసీఆర్ పరోక్షంగా వత్తాసు పలుకుతున్నాయని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కేసీఆర్ రాష్ట్రంలో దృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడియకో మాట మార్చడానికి ఆయన సీఎం కుర్చిలో ఉన్నారా? లేక చప్రాసి పని ఏమైనా చేస్తున్నారా? అంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!